Share News

Free Sewing Machines: మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

ABN , Publish Date - Jan 23 , 2025 | 05:03 PM

Free Sewing Machines: మహిళల స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. వారిని కోటీశ్వరులు చేయడం కోసం చాలా పథకాలను ప్రారంభిస్తోంది.

Free Sewing Machines: మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నుంచి దేశంలోని దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా సాధికారతే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాయి. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వాలు పలు కార్యక్రమాలు చేపడుతోంది. ఆ క్రమంలో తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన క్రిస్టియన్ మహిళల నుంచి ఉచిత గృహ కుట్టు మిషన్లకు దరఖాస్తులను జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారాలు ఆహ్వానిస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద కుట్టు మిషన్లు అందిస్తోంది. అందుకోసం దరఖాస్తు చేసుకోవాలని మహిళలకు సూచిస్తోంది. అందుకు అర్హత కలిగిన మహిళలు tgobmms.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని ఉన్నతాధికారులు సూచనలు చేస్తున్నారు.

ఈ పథకం ద్వారా కుట్టు మిషన్ పొందాలంటే.. బాప్టిజం, బీసీ సీ సర్టిఫికేట్ కలిగి ఉండాలని స్పష్టం చేశారు. అలాగే తెల్ల రేషన్ కార్డు లేదా ఆహార భద్రత కార్డు... ఈ రెండు అందుబాటులో లేకుంటే.. ఆదాయ దృవీకరణ పత్రం ఉండాలని దరఖాస్తు చేసుకొనే వారికి ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.


ఇక గ్రామీణ ప్రాంత అభ్యర్థుల వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.2 లక్షల వరకు ఉండాలని సూచిస్తున్నారు. ఈ పథకంలో ద్వారా లబ్ది పొందాలను కొనే వారికి కనీస విద్యా అర్హత ఐదో తరగతి ఉండాలని చెప్పారు. కనీసం వయస్సు 21 ఏళ్ల నుంచి 55 ఏళ్ల మధ్య ఉన్న వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. వయస్సు ధృవీకరణ పత్రం.. ఆధార్ లేదా ఓటర్ కార్డు ఉండాలని చెబుతున్నారు.

Also Read: తక్కువ పెట్టుబడితో.. రోజుకు రూ.10 వేలు లాభం


ఒక కుటుంబానికి ఒక కుట్టు మిషన్ మాత్రమే మంజూరు చేయబడుతోందని తెలిపారు. అయితే శిక్షణ ధృవీకరణ పత్రం సైతం సమర్పించాలని స్పష్టం చేశారు. ఇక దరఖాస్తుదారులు గత ఐదేళ్లలో టీజీసీఏంఎఫ్సీ నుంచి ఆర్థిక సాయం పొందలేదని స్వీయ పత్రం రాసి ఇవాల్సి ఉంది. ఈ పథకం ద్వారా ఆసక్తి, అర్హత కలిగిన మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని.. మరిన్ని వివరాల కోసం 9182540680, 9573769507 సెల్ నెంబర్లను సంప్రదించాలని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారాలు స్పష్టం చేశారు.

For Business News And Telugu News

Updated Date - Jan 23 , 2025 | 05:53 PM