ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నియోజకవర్గాన్ని విద్యా హబ్‌గా మారుస్తా

ABN, Publish Date - Jul 29 , 2025 | 11:24 PM

నాగర్‌కర్నూల్‌ అసెంబ్లీ నియోజవర్గాన్ని విద్యాహబ్‌గా మారుస్తానని ఎమ్మెల్యే డాక్టర్‌ కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు.

కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి

- నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, జూలై 29 (ఆంధ్రజ్యో తి) : నాగర్‌కర్నూల్‌ అసెంబ్లీ నియోజవర్గాన్ని విద్యాహబ్‌గా మారుస్తానని ఎమ్మెల్యే డాక్టర్‌ కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ‘పీఎం శ్రీ’ పాఠశాలగా ఎంపి కైన జెడ్పీహెచ్‌ బాలుర ఉన్నత పాఠశాలను ఎ మ్మెల్యే ప్రారంభించారు. అంతకు ముందు ప్రధా నమంత్రి స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా అనే పథకాన్ని ప్రారంభించి ఐదేళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉత్తమ పీఎం శ్రీ పాఠశాలలుగా గుర్తించిన వాటి విద్యార్థులతో వి ద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రదాన్‌ వీడియో కాన్ప రెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఎమ్మెల్యే మాట్లా డుతూ రానున్న రోజుల్లో నాగర్‌కర్నూల్‌ నియో జకవర్గానికి ఇంజనీరింగ్‌ కళాశాలను నెలకొ ల్పడానికి కృషి చేస్తున్నానన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రమణారావు, జిల్లా ఇంటర్‌ విద్యా నోడల్‌ అధికారి వెంకటరమణ, ప్రధానోపాధ్యాయులు లత, ఎంఈవో భాస్కర్‌ రెడ్డి, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు

నియోజకవర్గంలోని అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో పట్టణంలోని 15 వార్డుకు చెందిన పలువురి లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇళ్ల మంజూరీ పత్రాలను అందజేశారు. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రమణా రావు, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jul 29 , 2025 | 11:24 PM