ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: కేజీఎఫ్‌ తరహాలో నల్ల మల్లారెడ్డి ఆగడాలు

ABN, Publish Date - Jan 26 , 2025 | 04:16 AM

ఆ లేఔట్‌లో ప్లాట్‌ కొనాలన్నా.. అమ్మాలన్నా మల్లారెడ్డి అనుమతి లేనిదే లావాదేవీ లు జరగవు. అమ్మేవారు రూ.50వేలు చెల్లించి, మల్లారెడ్డి ఇచ్చే ఎన్‌వోసీ తీసుకోవాల్సిందే. డెవల్‌పమెంట్‌ను ఆయనకే అప్పగించాలి. ఇల్లు నిర్మించే కాంట్రా క్ట్‌ కూడా ఆయనకే ఇవ్వాలి’’ అని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ వెల్లడించారు.

  • హైడ్రా కమిషనర్‌ రంగనాఽథ్‌ వ్యాఖ్య

  • దివ్యానగర్‌లో 4 కిలోమీటర్ల ప్రహరీ కూల్చివేసిన హైడ్రా అధికారులు

ఘట్‌కేసర్‌ రూరల్‌, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): ‘‘పంచాయతీ లేఔట్‌తో అనుమతి తీసుకుని, కాలనీల చుట్టూ ప్రహరీలు కట్టారు. నాలుగైదు కాలనీల కు ఒకే ఎంట్రీ, ఒకే ఎగ్జిట్‌ పెట్టిన డెవలపర్‌ నల్ల మల్లారెడ్డి.. కేజీఎఫ్‌ సినిమాలో మాదిరిగా నియంత లా ప్రవర్తిస్తున్నారు. ఆ లేఔట్‌లో ప్లాట్‌ కొనాలన్నా.. అమ్మాలన్నా మల్లారెడ్డి అనుమతి లేనిదే లావాదేవీ లు జరగవు. అమ్మేవారు రూ.50వేలు చెల్లించి, మల్లారెడ్డి ఇచ్చే ఎన్‌వోసీ తీసుకోవాల్సిందే. డెవల్‌పమెంట్‌ను ఆయనకే అప్పగించాలి. ఇల్లు నిర్మించే కాంట్రా క్ట్‌ కూడా ఆయనకే ఇవ్వాలి’’ అని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ వెల్లడించారు. దివ్యానగర్‌-కాచవాని సింగారంతోపాటు.. ఆరు కాలనీల్లో రోడ్లకు అడ్డంగా 4 కిలోమీటర్ల మేర నల్లమల్లారెడ్డి నిర్మించిన ప్రహరీని హైడ్రా శనివారం కూల్చివేసింది.


ఉదయం 3.30 గంటల సమయంలో ఈ ప్రాంతానికి కొంత దూరంలో సుమారు 25 ఎక్స్‌కవేటర్లతో మోహరించిన హైడ్రా బృందాలు.. ఉదయం 7గంటల సమయంలో దివ్యానగర్‌, సుప్రభాత్‌ టౌన్‌షి్‌పలకు చేరుకున్నాయి. ఆ వెంటనే.. మెయిన్‌గేట్లు, ప్రహరీల కూ ల్చివేతలను మొదలుపెట్టాయి. సుప్రభాత్‌ టౌన్‌షి్‌ప వద్ద ఎలాంటి ఉద్రిక్తతలు లేకున్నా.. దివ్యానగర్‌ వద్ద మల్లారెడ్డి అనుచరులు హైడ్రా సిబ్బందిని ప్రతిఘటించారు. హైడ్రాకు, సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా మల్లారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరులు నినాదాలు చేశారు. కూల్చివేతల అనంతరం దివ్యానగర్‌, బాబానగర్‌, కాచవానిసింగారం పరిసరాల ప్రజలు టపాసులు కాలుస్తూ.. సంబురాలు చేసుకున్నారు. 20 ఏళ్లుగా తమను నల్ల మల్లారెడ్డి అనేక ఇబ్బందులకు గురిచేశారని, ఈ ప్రాంతంలో ఓ నియంతలా వ్యహరిచాడని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డికి, హైడ్రాకు ధన్యవాదాలు తెలుపుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ కూల్చివేతలకు సంబంధించి రంగనాథ్‌ వివరాలను వెల్లడిస్తూ.. ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు.


30 ఏళ్లుగా సింగరేణి ఉద్యోగుల తంటాలు

‘‘నల్లమల్లారెడ్డి 1990లో కాచవానిసింగారం, కొర్రెముల రెవెన్యూ పరిధుల్లో 200 ఎకరాల్లో దివ్యానగర్‌తోపాటు మరో ఆరు గ్రామపంచాయతీ లేఔట్లు చే శారు. వీటిల్లో మొత్తం 2,200ప్లాట్లు ఉన్నాయి. అప్ప ట్లో సింగరేణి ఉద్యోగులు సుమారు 1,000 మంది ఇక్కడి ప్లాట్లను కొనుగోలు చేశారు. ఈ క్రమంలో వీరంతా ప్లాట్ల డెవల్‌పమెంట్‌ కోసం మల్లారెడ్డికి 15 ఏళ్ల క్రితం రూ.10.5 కోట్లు అందజేశారు. లేఔట్‌లో ముందుగా మౌలిక సదుపాయాలు కల్పించాలని వీరి మధ్య ఒప్పందం కుదిరింది. మల్లారెడ్డి ఆ మొ త్తాన్ని వెంచర్‌ అభివృద్ధికి కాకుండా.. కాలనీ భద్రత పేరుతో 4 కిలోమీటర్ల మేర ఎత్తైన ప్రహరీ నిర్మించారు. ఎలాంటి మౌలిక సదుపాయాలను కల్పించలేదు’’ అని రంగనాథ్‌ వివరించారు. దివ్యానగర్‌తోపాటు.. మరో ఆరు కాలనీలకు రెండుచోట్ల నుంచి మాత్రమే రాకపోకలకు ఏర్పాటు చేశారని తెలిపారు. ‘‘ఆ ప్రాంతంలో మార్కెట్‌ విలువ రూ.35 వేలు ఉంటే.. మల్లారెడ్డి తక్కువకే కొనేవారు. ఇలా మధ్యతరగతి ప్రజలను దోచుకున్నారు.


కాలనీల్లోని పార్కులను, ఓపెన్‌ స్థలాలను ఆక్రమించారు. వాటిల్లో వ్య వసాయం చేశారు’’ అని వెల్లడించారు. గేటెడ్‌ కమ్యూనిటీకి మాత్రమే ప్రహరీని నిర్మించుకునే అవకాశం ఉంటుందని, పంచాయతీ లేఔట్లకు కాదని స్పష్టం చేశారు. ఇతర కాలనీల వారికి రోడ్డు సదుపాయం లేకుండా మల్లారెడ్డి ఓ నియంతలా వ్యవహరించేవారని చెప్పారు. సింగరేణియన్‌ సంక్షేమ సంఘం సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 8న తాను స్వయంగా దివ్యానగర్‌లో పరిస్థితులను క్షేత్రస్తాయిలో పరిశీలించానన్నారు. ఈ నెల 23న న ల్లమల్లారెడ్డి, సింగరేణియన్‌ సంక్షేమ సంఘం సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. శనివారం ఉదయం ప్రహరీతో పాటు.. రోడ్లకు అడ్డంగా ఉన్న నిర్మాణాలను కూల్చివేసినట్లు వెల్లడించారు. సుప్రీంకోర్టు తీర్పు, మునిసిపల్‌ చట్టాల ప్రకారం ఏదైనా రహదారి ఆక్రమణలకు గురైతే నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేయవచ్చన్నారు.


గోడలు, గేట్లు కూల్చడం అక్రమం: మల్లారెడ్డి

కాలనీలకు రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న గోడలను, గేట్లను హైడ్రా అధికారులు కూల్చడం అక్రమమని నల్ల మల్లారెడ్డి ఆరోపించారు.రోడ్లు, ప్రహరీ కూల్చోద్దని కోర్టు ఆదేశాలున్నా.. హైడ్రా కమిషనర్‌ కూల్చివేతలు చేపట్టారని ఆవేదన వ్యక్తంచేశారు.


ఇవీ చదవండి:

క్రికెట్ చరిత్రలో సంచలనం.. 73 ఏళ్ల ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్

రంజీ ట్రోఫీ.. రోహిత్ టీమ్ ఘోర ఓటమి

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 26 , 2025 | 04:16 AM