HYDRA: అక్రమ నిర్మాణాన్ని పరిశీలించిన హైడ్రా కమిషనర్
ABN, Publish Date - Jan 05 , 2025 | 04:34 AM
మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా నిర్మించిన భవనాన్ని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శనివారం పరిశీలించారు.
హైదరాబాద్, బేగంపేట, మోతి నగర్, జనవరి 4 (ఆంధ్రజ్యోతి) : మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా నిర్మించిన భవనాన్ని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శనివారం పరిశీలించారు. జీహెచ్‌ఎంసీ నోటీసులు, హైకోర్టు ఉత్తర్వులు పట్టించుకోకుండా సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్‌తో కలిపి ఐదంతస్తుల భవనాన్ని నిర్మించడంపై స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి హైడ్రా కమిషనర్ ఆ భవనాన్ని పరిశీలించారు. నోటీసులు ఇచ్చినా లెక్క చేయకుండా నిర్మించినందుకు త్వర లోనే చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
Updated Date - Jan 05 , 2025 | 04:35 AM