Hyderabad: పారిశ్రామికవేత్త జనార్దన్ రావు హత్య కేసు.. పోలీస్ కస్టడీలో అసలు నిజాలు..
ABN, Publish Date - Feb 18 , 2025 | 12:37 PM
హైదరాబాద్: పోలీస్ కస్టడీలో భాగంగా మెుదటి రోజు పారిశ్రామివేత్త జనార్దన్ రావును ఎందుకు హత్య చేశావంటూ పంజాగుట్ట పోలీసులు కీర్తి తేజను ప్రశ్నించారు. అయితే ఆ రోజు అతను ఏమీ మాట్లాడకుండా నేల చూపులు చూస్తూ ఉండిపోయాడు.
హైదరాబాద్: వెల్జాన్ గ్రూపు సంస్థల అధినేత జనార్దన్ రావు హత్య సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సొంత మనమడే ఆయన్ను 72 సార్లు కత్తితో పొడిచి చంపేయడం తీవ్ర కలకలం పేరింది. ఈ కేసులో నిందితుడు కీర్తి తేజను పోలీసులు అరెస్టు చేశారు. కాగా, కీర్తి తేజను నాలుగు రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. నాలుగు రోజులుగా నిందితుడిని విచారించిన హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. మెుదటి రోజు కీర్తి తేజ నోరు విప్పకపోయినప్పటికీ ఆ తర్వాత హత్యకు గల కారణాలను కీర్తి తేజ పోలీసులకు వివరించాడు.
పోలీస్ కస్టడీలో భాగంగా మెుదటి రోజు పారిశ్రామివేత్త జనార్దన్ రావును ఎందుకు హత్య చేశావంటూ పంజాగుట్ట పోలీసులు కీర్తి తేజను ప్రశ్నించారు. అయితే ఆ రోజు అతను ఏమీ మాట్లాడకుండా నేల చూపులు చూస్తూ ఉండిపోయాడు. ఎన్ని ప్రశ్నలు వేసినా మౌనంగా ఉండిపోయి పోలీసుల సహనానికి పరీక్ష పెట్టాడు. రెండో రోజూ నిందితుడిని హత్య జరిగిన ఘటనా స్థలానికి తీసుకెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్‌కు ప్రయత్నించారు. అక్కడా నోరు విప్పలేదు కీర్తి తేజ. కానీ, నిందితుడు పారిపోయిన తర్వాత మంటల్లో కాల్చివేసిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ అనంతరం మాత్రం ఎట్టకేలకు కీర్తి తేజ అసలు విషయాలు వెల్లడించాడు.
కస్టడీలో కీర్తి తేజ చెప్పిన విషయాలు..
"యూ బెగ్గర్ అంటూ తాత జనార్దన్ రావు ప్రతిరోజూ నన్ను అవమానించేవాడు. ఏ రోజూ నన్ను సొంత మనిషిగా చూడలేదు. కుటుంబసభ్యుడిగా భావించలేదు. అందరి కంటే హీనంగా చూస్తూ దారుణంగా వ్యవహరించేవాడు. ప్రతీరోజూ బెగ్గర్.. బెగ్గర్ అంటూ పిలిచేవాడు. ఆఫీసుకు వెళ్తే అక్కడా అవమానించేవాడు. తాత అలా తిట్టడం వల్ల ఆఫీస్ స్టాఫ్ కూడా చిన్నచూపు చూసేవారు. ఆస్తి పంపకాలు, పదవుల కేటాయింపుల్లోనూ తక్కువ చేశాడు. చివరకు డైరెక్టర్ పదవినీ రెండో కుమార్తె కొడుకుకు ఇచ్చాడు. అప్పట్నుంచి నాకు, తాతకు మధ్య గొడవలు పెరిగాయి. అందుకే అతన్ని చంపేయాలని నిర్ణయించుకున్నా. ఇన్‌స్టామార్ట్ నుంచి కత్తి కొనుగోలు చేసా. బట్టలు తగలబెట్టేందుకు అమెజాన్ బ్యూటేన్ గ్యాస్ కొనుగోలు చేశా. హత్య జరిగిన రోజు నాకు, తాతకు మధ్య పెద్దఎత్తున గొడవ జరిగింది. ఆస్తిలో వాటా కావాలని అడిగితే ఇవ్వను అన్నాడు. కోపంతో కత్తితో కసితీరా పొడిచా. హత్య చేసిన తర్వాత బీఎస్ మక్తా ఎల్లమ్మగూడ పక్కనే ఖాళీ స్థలంలో కత్తి, రక్తంతో ఉన్న నా బట్టలు తగులబెట్టానని" తెలిపాడు.
ఈ వార్తలు కూడా చదవండి:
Emergency Landing: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో తప్పిన పెను విమాన ప్రమాదం..
Toronto plane crash: మరో భారీ విమాన ప్రమాదం.. ఈసారి ఎక్కడంటే..
Updated Date - Feb 18 , 2025 | 12:40 PM