Emergency Landing: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో తప్పిన పెను విమాన ప్రమాదం..
ABN , Publish Date - Feb 18 , 2025 | 10:02 AM
చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న బ్లూడార్ట్ కార్గో విమానంలో ల్యాండింగ్ గేర్ సమస్య తలెత్తింది. సమస్యను గుర్తించిన పైలట్ వెంటనే సమాచారాన్ని శంషాబాద్ విమానాశ్రయ అధికారులకు తెలిపాడు.
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో పెను ప్రమాదం తృటిలో తప్పింది. చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న బ్లూడార్ట్ కార్గో విమానంలో ల్యాండింగ్ గేర్ సమస్య తలెత్తింది. సమస్యను గుర్తించిన పైలట్ వెంటనే సమాచారాన్ని శంషాబాద్ విమానాశ్రయ అధికారులకు తెలిపాడు. అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరాడు. దీంతో అప్రమత్తమైన ఎయిర్‌పోర్ట్ అధికారులు అంతర్జాతీయ విమానాలన్నీ ఆపేసి ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చారు. ఎంతో చాకచక్యంగా పైలట్ విమానాన్ని సురక్షితంగా దించారు. ఈ సమయంలో కార్గో విమానంలో ఆరుగురు సిబ్బింది ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Road Accident: పల్టీలు కొట్టిన కారు.. తిరుమల నుంచి వస్తున్న భక్తులకు..
మరోవైపు కెనడా దేశం టొరంటో పియర్సన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో విమాన ప్రమాదం జరిగింది. మిన్నియాపోలిస్ నుంచి వచ్చిన డెల్టా ఎయిర్‌లైన్స్ విమానం ల్యాండ్ అవుతూ బోల్తా కొట్టింది. బలమైన గాలులు, రన్ వేపై మంచు కారణంగా ల్యాండింగ్‌లో సమస్యలు తలెత్తి దిగిన క్షణాల్లోనే తల్లకిందులైంది. ఈ ప్రమాదంలో 18 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను ఆస్పత్రికి తరలించామని, ప్రమాదానికి గురైన విమానంలో 80 మంది ప్రయాణికులు ఉన్నట్లు ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపారు. కాగా, సోమవారం మధ్యాహ్నం ఘటన జరిగినట్లు తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి:
Gold and Silver Prices Today: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు ఎంత పెరిగాయంటే..
Toronto plane crash: మరో భారీ విమాన ప్రమాదం.. ఈసారి ఎక్కడంటే..