Road Accident: పల్టీలు కొట్టిన కారు.. తిరుమల నుంచి వస్తున్న భక్తులకు..
ABN , Publish Date - Feb 18 , 2025 | 09:10 AM
నరసరావుపేటకు చెందిన 11 మంది తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని అనుకున్నారు. ఈ మేరకు అంతా కలిసి దైవ దర్శనం కోసం నిన్న (సోమవారం) కారులో తిరుమలకు చేరుకున్నారు.

నెల్లూరు: కావలి మండలం రుద్రకోట (Rudrakota) జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తిరుమల నుంచి వస్తున్న భక్తుల కారు (Car Accident) పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో 11 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. నరసరావుపేట (Narasaraopeta)కు చెందిన 11 మంది తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని అనుకున్నారు. ఈ మేరకు అంతా కలిసి దైవ దర్శనం కోసం నిన్న (సోమవారం) కారులో తిరుమలకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని మెుక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తిరుగు ప్రయాణం అయ్యారు.
Tesla Hiring in India: కీలక పరిణామం.. భారత్‌లో ఉద్యోగుల నియామకాలు ప్రారంభించిన టెస్లా!
అయితే వారి వాహనం మంగళవారం తెల్లవారుజామున నెల్లూరు జిల్లా రుద్రకోట వద్దకు రాగానే ప్రమాదానికి గురైంది. అంతా నిద్రలో ఉండగా ప్రమాదవశాత్తూ కారు బోల్తాకొట్టింది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే బాధితులంతా తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరు చిన్నారులు సహా మెుత్తం 11 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. గమనించిన ఇతర వాహనదారులు 108 వాహనానికి సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని నరసరావుపేట ఆస్పత్రికి తరలించగా.. మిలిగిన 9 మందిని కావలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రమాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Gold and Silver Prices Today: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు ఎంత పెరిగాయంటే..
Toronto plane crash: మరో భారీ విమాన ప్రమాదం.. ఈసారి ఎక్కడంటే..