ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Banjara Hills Car Accident: బంజారాహిల్స్ కారు ప్రమాదం.. నిందితుడు ఎవరంటే..

ABN, Publish Date - Jan 25 , 2025 | 01:19 PM

హైదరాబాద్: బంజారాహిల్స్‌(Banjara Hills)లో శనివారం ఉదయం కారు బీభత్సం(Car Accident) సృష్టించిన సంగతి తెలిసిందే. అతి వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ఫుట్ పాత్‌పై నిద్రస్తున్న వారిపైకి దూసుకెళ్లింది.

Car Accident

హైదరాబాద్: బంజారాహిల్స్‌(Banjara Hills)లో శనివారం ఉదయం కారు బీభత్సం (Car Accident) సృష్టించిన సంగతి తెలిసిందే. అతి వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ఫుట్ పాత్‌పై నిద్రస్తున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. అయితే నిందితుడు కారును అక్కడే వదిలిపెట్టి పారిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కారు ప్రమాదానికి నిజామాబాద్ జిల్లాకు చెందిన షార్ట్ ఫిల్మ్ డైరెక్టరే కారణమని గుర్తించారు.

Union Minister: రేపు భారత మాతకు మహాహారతి


స్నేహితులతో కలిసి నిందితుడు అర్ధరాత్రి వరకూ పూటుగా మద్యం తాగాడని పోలీసులు తెలిపారు. అనంతరం ఇంటికి వెళ్లేందుకు తెల్లవారుజామున 3 గంటలకు బయలుదేరినట్లు చెప్పారు. మద్యం మత్తులో కారును అతివేగంగా నడిపినట్లు పేర్కొన్నారు. అయితే బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్దకు రాగానే వాహనం అదుపుతప్పి ఫుట్ పాత్‌పై నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లినట్లు వెల్లడించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో వ్యక్తి గాయపడినట్లు తెలిపారు. అనంతరం నిందితుడు తన వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయినట్లు చెప్పారు. కేసు దర్యాప్తులో నిజామాబాద్ జిల్లా వాసిగా గుర్తించినట్లు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Meerpet Madhavi Case: వీడిన మాధవి మర్డర్ మిస్టరీ.. కుక్కర్‌లో కాదు.. ఏకంగా పొటాషియం హైడ్రాక్సైడ్‌తో..

Dil Raju: ఐటీ దాడులపై దిల్‌ రాజ్ ఫస్ట్ రియాక్షన్..

Updated Date - Jan 25 , 2025 | 01:21 PM