TG NEWS: వాష్ రూంలో కెమెరాలు.. మరోసారి కలకలం
ABN, Publish Date - Jan 04 , 2025 | 03:31 PM
TELANGANA: మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల బాలికల బాత్రూంలో మొబైల్ కెమెరాల ఘటన కలకలం సృష్టిచింది. తమకు రక్షణ కల్పించాలని విద్యార్థినులు ఆందోళనకు దిగారు. పోలీసులకు విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.
మహబూబ్‌నగర్ : విద్యాలయాలకు విద్యార్థినులు వెళ్లాలంటనే జంకుతున్నారు. పాఠశాలల్లో చదువుకునే బాలికల బాత్రూంలో మొబైల్ కెమెరాలు ఉన్నాయని ఈ మధ్య తరుచుగా వార్తలు వస్తున్నాయి. దీంతో బాలికల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. విద్యాలయాలకు బాలికలను పంపించాలంటేనే భయపడిపోతున్నారు. తెలంగాణలో ఈ మధ్య వరుసగా ఇలాంటి ఘటనలు బయట పడుతుండటంతో విద్యార్థినులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మహిళల రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా కొంతమంది ఆకతాయిల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు.
తాజాగా మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల బాలికల బాత్రూంలో మొబైల్ కెమెరాల ఘటన కలకలం సృష్టిచింది. తమకు రక్షణ కల్పించాలని విద్యార్థినులు ఆందోళనకు దిగారు. పోలీసులకు విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో నిందితుడు నక్క సిద్ధార్థ అనే విద్యార్థిని సీఐ అప్పయ్య అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను మీడియాకు పోలీసులు తెలిపారు. ఈ విషయంపై ఏబీవీపీ ఆధ్వర్యంలో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థినులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
TG News: కేక్ తింటున్నారా.. జాగ్రత్తండోయ్
Hyderabad: కొంతమంది తెలుగు భాషను చిన్నచూపు చూస్తున్నారు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
HYDRA: హైడ్రా మరో కీలక నిర్ణయం..
Read Latest Telangana News And Telugu News
Updated Date - Jan 04 , 2025 | 03:39 PM