ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kalvakuntla Kavitha: కవితకు షాక్ ఇచ్చిన కోర్టు

ABN, Publish Date - Aug 04 , 2025 | 06:13 PM

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కోర్టు షాక్ ఇచ్చింది. దీంతో ఆమె తన దీక్షను విరమించింది.

K Kavitha

హైదరాబాద్, ఆగస్ట్ 04: ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా చేపట్టిన 72 గంటల నిరాహార దీక్షను విరమిస్తున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం హైదరాబాద్‌లో ప్రకటించారు. ఈ నిరాహార దీక్షకు కోర్టు అనుమతి నిరాకరించిందని చెప్పారు. దీంతో తాను చేపట్టిన ఈ దీక్షను విరమిస్తున్నట్లు తెలిపారు. కోర్టులను ధిక్కరించే పరిస్థితి లేదని పేర్కొన్నారు. కోర్టుల పట్ల తనకు గౌరవం ఉందన్నారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్పులు ఎత్తి చూపుతూ.. బీసీల తరఫున పోరాటం చేస్తున్నామని చెప్పారు. మేము ఒక్క అడుగు వెనక్కి వేస్తే.. 10 అడుగులు ముందుకు వేస్తామని కవిత చెప్పారు. కోర్టు తీర్పును గౌరవించి ఈ దీక్షను ఇంతటితో ముగిస్తున్నామన్నారు. ఈ పోరాటం ఆగదని.. అనేక రూపాల్లో చేస్తామని ఈ సందర్భంగా ఆమె ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ధర్నాలతో సాధించేది ఏం లేదన్నారు. మీరు రాష్ట్రపతి వద్దకు వెళ్లండంటూ తెలంగాణ ప్రభుత్వంలోని పెద్దలకు ఆమె సూచించారు.

రాష్ట్ర గవర్నర్‌పై సుప్రీంకోర్టులో కేసు వేయండంటూ అధికార పార్టీ నేతలకు హితవు పలికారు. ఢిల్లీలో టైమ్ పాస్ ధర్నాలు చేస్తే తెలంగాణ బీసీ బిడ్డలు ఊరుకోరని హెచ్చరించారు. ఈ దీక్ష విరమించినా.. మళ్లీ సమాలోచనలు చేసి మరో రూపంలో పోరాటం చేస్తామని వెల్లడించింది. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కేటాయించకుండా ఎన్నికలకు వెళ్తే వాటిని ఎలా ఆపాలో తనకు తెలుసునన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కచ్చితంగా వస్తాయనే నమ్మకం తనకు ఉందని ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత విశ్వాసం వ్యక్తం చేశారు.

తెలంగాణలో సెప్టెంబర్ 30వ తేదీ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గతంలో హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి.. గవర్నర్ వద్దకు పంపారు. ఈ బిల్లు ఆమోదానికి ఎటువంటి అడ్డంకులు ఎదురు కాకుండా.. సీనియర్ న్యాయవాదుల సలహాను సైతం ఆయన స్వీకరించారు.

అనంతరం కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఈ బిల్లును పంపారు. అయితే ఈ బిల్లు ఆమోదం కోసం దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆగస్ట్ 5వ తేదీన ధర్నా చేసేందుకు కాంగ్రెస్ పార్టీ రంగం సిద్ధం చేసింది. మరోవైపు ఈ బిల్లును ఆమోదించాలంటూ కేంద్రాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఆ క్రమంలో హైదరాబాద్‌లోని ధర్నా చౌక్ వద్ద సోమవారం 72 గంటల దీక్షను తన అనుచరులతో కవిత చేపట్టారు. అయితే ఈ దీక్షకు హైకోర్టు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆమె తన దీక్షను విరమించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

అరెస్ట్ చేయొచ్చు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

వారిపై చర్యలకు కాళేశ్వరం కమిషన్ కీలక సిఫార్స్

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 04 , 2025 | 06:27 PM