ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG News: వివాదాస్పదంగా ఏకశిలానగర్ భూముల వివాదం

ABN, Publish Date - Jan 21 , 2025 | 03:11 PM

Telangana: ‘‘ఏకశిలా నగర్ భూములకు యజమానుల మేము. ఈ వెంచర్‌కు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ మా వద్ద ఉన్నాయి.. అన్నీ న్యాయస్థానాల్లో తీర్పు మాకు అనుకూలంగా వచ్చాయి. భూ యజమానులమైన మమ్మల్ని రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా చిత్రీకరిస్తున్నారు. ఎంపీ ఈటల వాస్తవాలు తెలుసుకోకుండా దాడులకు దిగారు’’ అంటూ వెంచర్స్ నిర్వాహకులు మండిపడ్డారు.

Ekashila Nagar venture organizers

హైదరాబాద్, జనవరి 21: మల్కాజ్‌గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలానగర్ భూములు వివాదాస్పదంగా మారాయి. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌పై (BJP MP Etela Rajender) ఏకశిలా నగర్ వెంచర్ నిర్వాహకులు మండిపడ్డారు. ‘‘ఏకశిలా నగర్ భూములకు యజమానుల మేము. ఈ వెంచర్‌కు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ మా వద్ద ఉన్నాయి.. అన్నీ న్యాయస్థానాల్లో తీర్పు మాకు అనుకూలంగా వచ్చాయి. భూ యజమానులమైన మమ్మల్ని రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా చిత్రీకరిస్తున్నారు. ఎంపీ ఈటల వాస్తవాలు తెలుసుకోకుండా దాడులకు దిగారు’’ అంటూ మండిపడ్డారు.


ఎంపీ స్థాయి వ్యక్తి వీధి రౌడీలా వ్యవహరించి.. తన అనుచరులతో విచక్షణారహితంగా తమపై దాడికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిలో మొత్తం ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయని.. రక్తస్రావం వచ్చేలా ఈటల అనుచరులతో దాడికి దిగారన్నారు. కబ్జాకు పాల్పడుతున్న వారికి ఈటెల రాజేందర్ సహకరిస్తున్నారని ఆరోపించారు. ఈటల రాజేందర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఏకశిలా నగర్ వెంచర్ నిర్వాహకులు తెలిపారు. కాగా.. పేదల భూములను కబ్బా చేశారంటూ ఏకశిలానగర్‌లో రియల్ ఎస్టేట్ బ్రోకర్‌పై ఎంపీ ఈటల రాజేందర్ చేయి చేసుకోవడం ఇప్పుడు హాట్‌టాపిక్‌‌గా మారింది. మంగళవారం మల్కాజ్‌గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలానగర్‌లో ఎంపీ ఈటల ఈరోజు పర్యటించారు.

కంటైనర్‌ లారీపై అనుమానం.. వెనుక చూడగా షాకింగ్ సీన్..


ఈ సందర్భంగా అక్కడి బాధితుల ఫిర్యాదు మేరకు రియల్ ఎస్టేట్ బ్రోకర్‌పై ఎంపీ చేయి చేసుకున్నారు. పేదల భూములను కబ్జా చేస్తున్నారంటూ మండిపడ్డారు.పేదలపై దౌర్జన్యం చేస్తే సహించేది లేదని అన్నారు. నారపల్లి, కొర్రముల గ్రామాలల్లో పేద ప్రజలు కంచెలు, జంగల్ భూములు కొనుక్కొని ఇళ్లు కట్టుకుని ఉంటున్నారు. అయితే 149 ఎకరాల్లో ఇళ్లులు కట్లుకుని చాలా మంది అమ్ముకున్నారు. కానీ అమ్మిన తర్వాత కొత్తగా కొనుగోలు చేసినవారే ల్యాండ్‌ను కూడా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్లతో వాళ్లు కబ్జాలకు కూడా పాల్పడుతున్నారని ఎంపీకి ఫిర్యాదులు అందాయి. దీంతో ఈటల అక్కడకు వెళ్లి పరిశీలిస్తున్న సమయంలో రియల్ ఎస్టేట్ బ్రోకర్‌లు అక్కడకు వచ్చారు. వారిని చూసిన వెంటనే ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్‌పై ఎంపీ దాడి చేశారు.


ఇవి కూడా చదవండి..

బీజేపీ ఎంపీ ఈటల ఆగ్రహావేశం..

Congress Vs BRS: మాగంటిని అడ్డుకున్న కాంగ్రెస్ కార్పొరేటర్లు.. ఉద్రిక్తత

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 21 , 2025 | 03:27 PM