MP Etala: రియల్ ఎస్టేట్ ఏజెంట్ చెంప చెల్లుమనిపించిన ఎంపీ ఈటల
ABN , Publish Date - Jan 21 , 2025 | 01:41 PM
హైదరాబాద్: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పేదల భూములను కబ్జా చేశారంటూ రియల్ ఎస్టేట్ ఏజెంట్‌పై చేయి చేసుకున్నారు. ఎవరైనా పేదలపై దౌర్జన్యం చేస్తే ఖబర్దార్ అంటూ ఎంపీ ఈటల రాజేందర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్లను హెచ్చరించారు. బ్రోకర్లకు అధికారులు కొమ్ముకాస్తున్నారని, పేదల స్థలాలకు బీజేపీ అండగా ఉంటుందని ఈటల స్పష్టం చేశారు.
హైదరాబాద్: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (BJP MP Etala Rajendar) తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పేదల భూములను కబ్జా (Seizing lands Poor People) చేశారంటూ రియల్ ఎస్టేట్ ఏజెంట్(Real Estate Agent)పై ఈటల చేయి చేసుకున్నారు. మల్కాజ్‌గిరి జిల్లా, పోచారం మున్సిపాలిటీ పరిధిలో ఏకశిలనగర్‌లో పేదలను ఇబ్బందులు పెడుతున్న రియల్ ఎస్టేట్ బ్రోకర్‌పై ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు కబ్జా చేసి పేదలకు అన్యాయం చేస్తున్నారని తెలసి.. ఆ ప్రాంతాన్ని పరిశీలించడానికి మంగళవారం ఈటల వెళ్లారు. ఈ క్రమంలో ఎంపీని అడ్డుకుంటామని, టెంట్లు కూడా తగలబెడతామని రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అన్నారు. ఈ నేపథ్యంలో ఈటల అక్కడ భూములను పరిశీలిస్తున్న క్రమంలో బ్రోకర్లు వచ్చారు. వారిని చూసి ఆగ్రహానికి గురైన ఎంపీ ఈటల రాజేందర్ ఓ బ్రోకర్‌పై చేయి చేసుకున్నారు. తర్వాత బీజేపీ కార్యకర్తలు కూడా రియల్ ఎస్టేట్ బ్రోకర్‌పై దాడి చేశారు.
ఈ వార్త కూడా చదవండి..
ఫిబ్రవరి 15 కోసం ఎదురుచూస్తున్నా: సింగర్ శ్రీరామ్
ఎవరైనా పేదలపై దౌర్జన్యం చేస్తే ఖబర్దార్ అంటూ ఎంపీ ఈటల రాజేందర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్లను హెచ్చరించారు. బ్రోకర్లకు అధికారులు కొమ్ముకాస్తున్నారని, పేదల స్థలాలకు బీజేపీ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. నారపల్లి, కొర్రముల గ్రామాలల్లో పేద ప్రజలు కంచెలు, జంగల్ భూములు కొనుక్కొని ఇళ్లు కట్టుకుని ఉంటున్నారు. అయితే 149 ఎకరాల్లో ఇళ్లులు కట్లుకుని చాలా మంది అమ్ముకున్నారు. కానీ అమ్మిన తర్వాత కొత్తగా కొనుగోలు చేసినవారే ల్యాండ్‌ను కూడా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్లతో వాళ్లు కబ్జాలకు కూడా పాల్పడుతున్నారని ఎంపీకి ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో ఈటల రాజేందర్ అక్కడికి వెళ్లారు. ఆయన భూములు పరిశీలిస్తున్న క్రమంలో రియల్ ఎస్టేట్ బ్రోకర్ వచ్చి ఆందోళన చేసి.. వాగ్వాదానికి దిగారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన ఈటల బ్రోకర్‌పై దాడి చేశారు. తర్వాత బీజేపీ కార్యకర్తలు కూడా బ్రోకర్‌పై దాడి చేశారు. పేదల భూమల కబ్జాపై కలెక్టర్ దృష్టికి తీసుకువెళతామని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
కాగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి ఆరోపణలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై బీజేపీ జాతీయ నాయకత్వం ఆరా తీసింది. పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు లక్ష్యమేంటి.. ఎవరెవరికి సమన్లు జారీ చేస్తోంది? ఏయే అంశాలపై కమిషన్ విచారణ జరుపుతోంది? వంటి వివరాలను తక్షణం తమకు అందించాలని రాష్ట్రపార్టీ నాయకత్వాన్ని ఆదేశించింది. మాజీ మంత్రి ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌కు నోటీసులు జారీ చేసే అవకశాముందంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశంపైనా నివేదిక ఇవ్వాలని సూచించింది. దీంతో, నాలుగు పేజీల అత్యవసర నివేదికను పార్టీ రాష్ట్ర నేతలు సోమవారమే జాతీయనాయకత్వానికి పంపించారు. ఈ నివేదికలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పరిణామాలను వివరించింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ వచ్చిన ఆరోపణల నిగ్గు తేల్చేందుకు పీసీ ఘోష్ కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిషన్.. కాళేశ్వరం ప్రాజెక్టు పనులతో సంబంధమున్న నీటిపారుదల శాఖతో పాటు ఆర్థికశాఖ ఉన్నతాధికారులను విచారించింది. 2014-17 మధ్యలో కాళేశ్వరం పనులు జరిగినప్పుడు అప్పటి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీశ్‌రావు, అప్పటి ఆర్థిక మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌కు కూడా కమిషన్ సమన్లు జారీ చేసే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర నాయకత్వం ఆ నివేదికలో పొందుపరచినట్లు తెలిసింది. మాజీ సీఎం కేసీఆర్‌తో పాటు అప్పటి నీటిపారుదల, ఆర్థిక మంత్రులను విచారించే అవకాశం ఉందని రాష్ట్ర పార్టీ నివేదించినట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
దావోస్ పర్యటనలో సీఎం చంద్రబాబు బిజీ బిజీ
ఏపీ ప్రజలు ఎగిరిగంతేసే వార్త..
వీర జవాన్ కార్తీక్ మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News