దావోస్ పర్యటనలో సీఎం చంద్రబాబు బిజీ బిజీ
ABN, Publish Date - Jan 21 , 2025 | 12:23 PM
సింగపూర్: దావోస్ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీ బిజీగా గడుపుతున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రపంచ దిగ్గజ కంపెనీల అధిపతులతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. 15కుపైగా సమావేశాల్లో వివిధ సంస్థల ప్రతినిధులతో భేటీలు కానున్నారు.
సింగపూర్: దావోస్ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీ బిజీగా గడుపుతున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రపంచ దిగ్గజ కంపెనీల అధిపతులతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. 15కుపైగా సమావేశాల్లో వివిధ సంస్థల ప్రతినిధులతో భేటీలు కానున్నారు. సింగపూర్ ప్రతినిధులతోనూ చంద్రబాబు సమావేశం కానున్నారు. అంతర్జాతీయ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇవ్వనున్నారు. ఇక ఏపీలో పెట్టుబడులు పెట్టే అవకాశాలను చంద్రబాబు వివరించనున్నారు.
ఈ వార్త కూడా చదవండి..
ఏపీ ప్రజలు ఎగిరిగంతేసే వార్త..
రెండో రోజు దావోస్ పర్యటనలో సీఎం చంద్రబాబు, ఆయన మంత్రుల బృందం బిజీ బిజీగా గడుపుతున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఇఎఫ్) వార్షిక సదస్సులో ప్రపంచ దిగ్గజ కంపెనీ అధిపతులతో ఈరోజు సమావేశం కాబోతున్నారు. 15కుపైగా వివిధ సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు ముఖాముఖి భేటీలు నిర్వహిస్తారు.
లక్ష్మీ మిట్టల్‌తో చంద్రబాబు, లోకేష్ భేటీ..
ఉక్కు దిగ్గజం లక్ష్మీమిట్టల్‌తో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ భావనపాడులో పెట్రో కెమికల్ హబ్ ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఏపీలో సోలార్ సెల్ తయారు ప్లాంటు ఏర్పాటును పరిశీలించాలని లక్ష్మీ మిట్టల్‌ను కోరారు. కాగా ఈ సదస్సుకు తొలిసారిగా భారత్ భారీ బృందాన్ని పంపింది. భారత్ బృందంలో ఐదుగురు కేంద్ర మంత్రులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రల ముఖ్యమంత్రులు, వివిధ రాష్ట్రాలకు చెందిన అనేకమంది మంత్రులతోపాటు దాదాపు వంద మంది సీఈవోలు, ఇతర అధికారులు ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వీర జవాన్ కార్తీక్ మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం
అధికారుల సమావేశం.. రమ్మీ ఆడుతున్న డీఆర్వో
అట్టహాసంగా ప్రారంభమైన వరల్డ్ ఎకనికమిక్ ఫోరం సదస్సు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Jan 21 , 2025 | 12:23 PM