ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Telangana Four Schemes: గుడ్‌న్యూస్.. తెలంగాణలో రేపే నాలుగు పథకాలు ప్రారంభం

ABN, Publish Date - Jan 25 , 2025 | 04:57 PM

Telangana Schemes: త్వరలోనే మరో నాలుగు పథకాలను తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేసింది తెలంగాణ సర్కార్. అందులో ప్రధానమైనవి కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకం. ఈ పథకాల అమలుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యింది.

Telangana Schemes

హైదరాబాద్, జనవరి 25: తెలంగాణలో (Telangana) కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన వెంటనే పేదలకు సంక్షేమ పథకాలను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు సన్నాహకాలు చేస్తోంది. ఇప్పటికే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు, గృహ లక్ష్మీ (ఉచిత విద్యుత్), రూ.500 గ్యాస్ సిలిండర్‌తో పాటు ఆరోగ్యశ్రీ సాయాన్ని రూ.10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే మరో నాలుగు పథకాలను తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేసింది తెలంగాణ సర్కార్. అందులో ప్రధానమైనవి కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకం. ఈ పథకాల అమలుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యింది.


ఇక ముఖ్యమైన నాలుగు పథకాల అమలు జరిగే తేదీ రానే వచ్చేసింది. రేపే (జనవరి 26) తెలంగాణ సర్కార్ ఆ పథకాలను ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేసింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాలను ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే గ్రామసభలు, సర్వేలు నిర్వహించిన సర్కార్.. అర్హులైన ప్రతీఒక్కరికీ పథకాలు అమలు జరిగేలా చర్యలు తీసుకుంది. అలాగే ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని ఇప్పటికే మంత్రులు స్పష్టం చేశారు.

విజయసాయి రాజకీయ సన్యాసంపై చంద్రబాబు ఏమన్నారంటే


కొత్త రేషన్ కార్డులు

తెలంగాణ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్‌ కార్డులకు మోక్షం లభించింది. జనవరి 26న కొత్త రేషన్‌ కార్డులను అర్హులకు జారీ చేయనుంది సర్కార్. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో కొత్త రేషన్ కార్డులను జారీ చేయనున్నారు. ఇందు కోసం ఈనెల 21 నుంచి 24 వరకు గ్రామ సభల్లో కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది సర్కార్. దీంతో అనేక మంది కొత్త రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటితో పాటు పాత రేషన్ కార్డు మార్పులు, చేర్పులు కూడా చేయనున్నారు. దరఖాస్తులను పరిశీలించిన అనంతరం అర్హులైన అందరికీ ఆహార భద్రతా కార్డులను అందించనుంది సర్కార్.


రైతు భరోసా

ఈనెల 26 నుంచి తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు రైతు భరోసా అందించాలని సర్కార్ నిర్ణయించింది. సాగుకు అనుకూలమైన భూములకు మాత్రమే పెట్టబడి సాయం కింద ఏడాదికి ఒక్కో ఎకరానికి రూ.12 వేలు అందించనుంది. ఇందుకోసం ఈనెల 20 వరకు సర్వే నిర్వహించిన అధికారులు.. సాగుకు అనుకూలం కాని భూముల లిస్టును గ్రామ పంచాయతీల్లో ఉంచారు. ఈనెల 26న అంటే రేపు రైతు భరోసాకు అర్హులైన వారి ఖాతాల్లోకి డబ్బులు జమకానున్నాయి.


ఇందిరమ్మ ఆత్మీయ భరోసా

రాష్ట్రంలో భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి రెండు విడతల్లో రూ.12 వేలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్క గుంట కూడా భూమి లేని నిరుపేదలు ఈ పథకానికి అర్హులుగా ఉండనున్నారు. ఈ పథకం కూడా జనవరి 26 నుంచి మొదలు కానుంది.


ఇందిరమ్మ ఇళ్ల పథకం..

గణతంత్ర దినోత్సవం (జనవరి 26) రోజు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనుంది తెలంగాణ సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం మొత్తం 80.54 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల కోసం క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 10.72 లక్షల దరఖాస్తులు రాగా.. ఇప్పటి వరకు 7.80 లక్షల దరఖాస్తుల ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తోంది. మిగిలిన దరఖాస్తుల పరిశీలనకు మరో వారం రోజు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల కోసం పలు విడతల్లో రూ.5 లక్షలు ఇవ్వనుంది తెలంగాణ సర్కార్.


ఇవి కూడా చదవండి..

రేపు భారత మాతకు మహాహారతి

TDP on Vijayasai: విజయసాయి రాజకీయ సన్యాసంపై టీడీపీ ఫస్ట్‌ రియాక్షన్

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 25 , 2025 | 04:57 PM