Share News

TDP on Vijayasai: విజయసాయి రాజకీయ సన్యాసంపై టీడీపీ ఫస్ట్‌ రియాక్షన్

ABN , Publish Date - Jan 25 , 2025 | 11:05 AM

TDP Leaders: విజయసాయి రాజీనామాపై టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. ఇలాంటి ఆర్థిక, నేరగాళ్లు రాజకీయాల్లో ఉంటే, ఆర్థిక ఉగ్రవాదులుగా మారే ప్రమాదం ఉంటుందన్నారు. రాజకీయాలను అడ్డం పెట్టుకొని వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టించారని విమర్శించారు.

TDP on Vijayasai: విజయసాయి రాజకీయ సన్యాసంపై టీడీపీ ఫస్ట్‌ రియాక్షన్
TDP Leader Palla Srinivas Rao

విశాఖపట్నం, జనవరి 25: వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి (Vijayasaireddy) రాజకీయాలకు రాజీనామా చేయడం ఇప్పుడు రాష్ట్రంలో సంచలనం టాపిక్‌గా నిలిచింది. విజయసాయి రాజకీయ సన్యాసంపై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. తాజాగా ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామాపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ (TDP Leader Palla Srinivas) ఘాటుగా స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి ఆర్థిక, నేరగాళ్లు రాజకీయాల్లో ఉంటే, ఆర్థిక ఉగ్రవాదులుగా మారే ప్రమాదం ఉంటుందన్నారు. రాజకీయాలను అడ్డం పెట్టుకొని వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టించారని విమర్శించారు.


ఇలాంటి వాళ్లు రాజకీయాల నుంచి బయటికి తప్పుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కూటమి నేతలు పేర్లు చెప్పడం ద్వారా తనకు అందరూ తెలుసని, ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. తప్పులు చేసి తప్పించుకుంటానంటే కుదరదు.. చేసిన తప్పులకు చట్టపరంగా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఆ పార్టీ అధ్యక్షుడు కూడా ఆర్థిక నేర ఆరోపణలు ఉన్న వ్యక్తి అని.. భవిష్యత్తులో వైసీపీ పార్టీ కూడా దివాలా తీయడం ఖాయమన్నారు. అందుకు నిదర్శనమే ఈ ఏ2 రాజీనామా అంటూ పల్లా శ్రీనివాస్ వ్యాఖ్యలు చేశారు.

గవర్నర్ ఫోన్ ట్యాపింగ్.. ఏకంగా పదిహేను రోజులు..


కొత్త నాటకానికి తెర: కనపర్తి

గుంటూరు జిల్లా: కన్యాశుల్కంలో వేశ్య మధురవాణి, అంతర్జాతీయ నేరస్తుడు చార్లెస్ శోభరాజ్ కూడా చివరి దశలో తాము మారిపోయాము కనికరించండి అన్నట్లుంది ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం అంటూ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు వ్యాఖ్యలు చేశారు. జగన్ అండతో తీవ్రమైన అవినీతి, అరాచకాలకు పాల్పడి సంపాదించిన సొమ్మునంతా బాధితులకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌పై చేసిన వ్యాఖ్యలకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలన్నారు. కేసుల నుంచి రక్షణ కోసమే జగన్ రెడ్డి సలహాతో సాయిరెడ్డి కొత్త నాటకానికి తెరలేపారని కనపర్తి శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు.


ఇవి కూడా చదవండి..

Eluru: అందరూ నిద్రలో ఉండగా అగ్నిప్రమాదం.. బాబోయ్.. ఇలా జరిగిందేంటి..

రేపు భారత మాతకు మహాహారతి

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 25 , 2025 | 11:05 AM