ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

KTR Challenges Revanth: రేవంత్‌లా దొంగలు, లంగలు... కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

ABN, Publish Date - Jul 16 , 2025 | 04:42 PM

KTR: అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడు రేవంత్ రెడ్డి లాంటి దొంగలు, లంగలు పదవుల్లోకి వస్తారని ఊహించలేదని కేటీఆర్ అన్నారు. అందుకే ఐదు సంవత్సరాల పాటు పదవిలో ఉండే విధంగా రాజ్యాంగం రాశారని.. లేకుంటే దేశంలో రేవంత్ లాంటి మోసాగాళ్లను రీకాల్ చేసే వ్యవస్థను దేశంలో కూడా ప్రవేశపెట్టేవారని అన్నారు.

MLA KTR

హైదరాబాద్, జులై 16: తెలంగాణ రాజకీయాల్లో ప్రతిపక్ష, అధికార పార్టీల నడుమ సవాళ్ల పర్వం కొనసాగుతోంది. మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR). ఈరోజు తెలంగాణ భవన్‌లో జరిగిన దళిత బంధు సాధనసమితి సమావేశంలో రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌కు దమ్ముంటే.. కూలిందంటున్న మేడిగడ్డ బ్యారేజి (Medigadda Barrage) మీదనే చర్చ పెడదాం అని.. చర్చకు..‌ రా అని సవాలు విసిరి చర్చకు వెళితే రేవంత్ రెడ్డి పారిపోయిండని చురకలు అంటించారు. చర్చకు వస్తవా అని పిలిచి పారిపోయిన పిరికి సన్నాసి రేవంత్ రెడ్డి అని సెటైర్లు వేశారు.

తెలివిలేక కాళేశ్వరాన్ని కూలేశ్వరం...

మరొకసారి నాగార్జునసాగర్ కట్టపైన చర్చకు వస్తావా అని సవాల్ విసిరిండని.. రేవంత్ రెడ్డికి తెలివిలేక కాళేశ్వరాన్ని కులేశ్వరం అంటున్నారని ఫైరయ్యారు. నాగార్జునసాగర్ కట్టమీద కాదు.. కానీ మేడిగడ్డ బ్యారేజ్ మీద చర్చకు రావాలని సవాలు విసిరారు. తుంగతుర్తి సూర్యాపేట నియోజకవర్గం చివరి మడి వరకు నిలిచిన నాయకుడు కేసీఆర్ అన్న సంగతి రేవంత్‌కు తెలుసునని కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని కేటీఆర్ ఫైరయ్యారు. ఇచ్చిన హామీలు అమలు చేయమంటే.. 'ఏం చేస్తారో చేసుకోండి… నన్ను కోసుకు తింటారా' అంటూ సీఎం రంకెలు వేస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఏం పీక్కుంటారో పీక్కోండని సీఎం పదేపదే అంటున్నారని.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఏం పీక్కుంటారో చూపిస్తారని కేటీఆర్ చురకలంటించారు.

మాకు ఇష్టం లేదు...

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడు రేవంత్ రెడ్డి లాంటి దొంగలు, లంగలు పదవుల్లోకి వస్తారని ఊహించలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అందుకే ఐదు సంవత్సరాల పాటు పదవిలో ఉండే విధంగా రాజ్యాంగం రాశారని అన్నారు. లేకుంటే దేశంలో రేవంత్ లాంటి మోసాగాళ్లను రీకాల్ చేసే వ్యవస్థను కూడా ప్రవేశపెట్టేవారని అన్నారు. రాజకీయాల్లో తిట్లు వాడడం తమకు ఇష్టం లేదని చెప్పారు. కానీ రేవంత్ రెడ్డికి ఆయన భాషలో చెప్తేనే అర్థమవుతుందని మాట్లాడాల్సి వస్తుందని.. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లు మేము కూడా తిట్లు వాడక తప్పడం లేదని వ్యాఖ్యలు చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

మల్నాడు డ్రగ్స్‌ కేసు.. నిందితుల కస్టడీ విచారణలో సంచలన విషయాలు

హనుమకొండలో మహిళ ఆత్మహత్యాయత్నం.. ఎందుకంటే

Updated Date - Jul 16 , 2025 | 05:21 PM