ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: భాగ్యనగర వాసులకు బిగ్ అలెర్ట్.. ఆ రోజున నీటి సరఫరా బంద్

ABN, Publish Date - Jan 30 , 2025 | 09:07 AM

హైదరాబాద్‌ మహా నగరానికి ఫిబ్రవరి ఒకటో తేదీన కృష్ణా జలాలు(Krishna waters) బంద్‌ కానున్నాయి. నల్లగొండ జిల్లాలోని నాసర్లపల్లి సబ్‌స్టేషన్‌లోని 132 కేవీ బల్క్‌ లోడ్‌ ఫీడర్‌ పీటీ మరమ్మతులకు గురైంది.

హైదరాబాద్‌ సిటీ: హైదరాబాద్‌ మహా నగరానికి ఫిబ్రవరి ఒకటో తేదీన కృష్ణా జలాలు(Krishna waters) బంద్‌ కానున్నాయి. నల్లగొండ జిల్లాలోని నాసర్లపల్లి సబ్‌స్టేషన్‌లోని 132 కేవీ బల్క్‌ లోడ్‌ ఫీడర్‌ పీటీ మరమ్మతులకు గురైంది. దీంతో నాగార్జున్‌సాగర్‌(Nagarjuna Sagar)లోని కోదండాపూర్‌లో గల వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌, పంపింగ్‌ స్టేషన్లకు విద్యుత్‌ సరఫరాలో సమస్యలు తలెత్తుతున్నాయి. టీజీ ట్రాన్స్‌కో అధికారులు శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మరమ్మతులు చేయనున్నారు. కోదండాపూర్‌(Kodandapur)లోగల వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌, పంపింగ్‌ స్టేషన్లకు విద్యుత్‌ను షడౌన్‌ చేయడంతో నగరానికి మూడు ఫేజ్‌ల్లో నీటి తరలింపు నిలిచిపోనుంది. కృష్ణా ఫేజ్‌-1, 2, 3 నుంచి నగరానికి నీటి సరఫరా ఉండదు. దీంతో నగరంలోని అత్యధిక ప్రాంతాలకు ఆరు గంటలపాటు తాగునీటి సరఫరాలో పాక్షిక అంతరాయం కలుగుతుంది.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఏఐ ఆధారిత సెక్స్‌ రాకెట్‌.. గచ్చిబౌలిలో విదేశీ యువతులతో వ్యభిచారం


ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం..

మీరాలం, కిషన్‌బాగ్‌, అల్జుబైల్‌ కాలనీ, శాస్ర్తిపురం, సంతోష్‏నగర్‌, వినయ్‌నగర్‌, సైదాబాద్‌, చంచల్‌గూడ(Saidabad, Chanchalguda), ఆస్మాన్‌గఢ్‌, యాకుత్‌పురా, మాదన్నపేట్‌, మహబూబ్‌ మాన్షన్‌, భోజగుట్ట, షేక్‌పేట్‌, బొగ్గులకుంట, అఫ్జల్‌గంజ్‌, ఆళ్లబండ, నారాయణగూడ, అడిక్‌మెట్‌, శివంరోడ్‌, చిలకలగూడ, జూబ్లీహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌, ప్రశాసన్‌నగర్‌, తట్టిఖానా, తార్నాక, లాలాపేట్‌, బౌద్ధనగర్‌, మారేడ్‌పల్లి, కంట్రోల్‌ రూమ్‌, రైల్వేస్‌, ఎంఈఎస్‌, కంటోన్మెంట్‌, ప్రకాశ్‌ నగర్‌, పాటిగడ్డ, రియాసత్‌నగర్‌, అలియాబాద్‌, మైసారం, బండ్లగూడ,


హస్మత్‌పేట్‌, ఫిరోజ్‌గూడ, గౌతమ్‌నగర్‌, సాహేబ్‌నగర్‌, వైశాలినగర్‌, అల్కాపురి, బీఎన్‌రెడ్డినగర్‌, వనస్థలిపురం, ఆటోనగర్‌, మహేంద్రహిల్స్‌, ఏలుగుట్ట, రామంతాపూర్‌, ఉప్పల్‌, నాచారం, హబ్సిగూడ, చిలుకానగర్‌, దేవేందర్‌నగర్‌, గచ్చిబౌలి, మాదాపూర్‌(Gachibowli, Madhapur), అయ్యప్ప సొసైటీ, కావురి హిల్స్‌, మధుబన్‌, దుర్గానగర్‌, బుద్వేల్‌, సులేమాన్‌ నగర్‌, గోల్డెన్‌ హైట్స్‌, 9 నంబర్‌, హార్డ్‌వేర్‌పార్క్‌, ధర్మసాయి, గంధంగూడ, బోడుప్పల్‌, మల్లికార్జుననగర్‌, మాణిక్‌చంద్‌, చెంగిచర్ల, భరత్‌నగర్‌, ఆనంద్‌నగర్‌ క్రాస్‌రోడ్స్‌, పీర్జాదిగూడ, మీర్‌పేట్‌, కుర్మగూడ, లెనిన్‌ నగర్‌, బడంగ్‌పేట్‌ తదితర ప్రాంతాలు.


ఈవార్తను కూడా చదవండి: Hyderabad: అవిశ్వాసంపై మాట్లాడొద్దు..

ఈవార్తను కూడా చదవండి: Khairatabad: అమెరికాలో రోడ్డు ప్రమాదం హైదరాబాద్‌ వాసి మృతి

ఈవార్తను కూడా చదవండి: ఆ రోజు నుంచే ప్రభుత్వ పథకాల జాతర: భట్టి విక్రమార్క..

ఈవార్తను కూడా చదవండి: High Alert: హై అలర్ట్‌గా తెలంగాణ ఛత్తీస్‌గడ్ సరిహద్దు..

Read Latest Telangana News and National News

Updated Date - Jan 30 , 2025 | 09:07 AM