ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

kumaram bheem asifabad- వరదొస్తే.. వాగులు దాటేదెట్లా?

ABN, Publish Date - Jun 26 , 2025 | 11:31 PM

వర్షాకాలం వచ్చిందంటే చాలు జిల్లాలో వాగులు, కల్వర్లులు ఉప్పొంగితే రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. ఏటా ఎజెన్సీ గ్రామాల ప్రజలు వర్షం పడితే బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సి వస్తోంది. సరైన రోడ్డు మార్గం లేక వాగులపై బ్రిడ్జీలు నిర్మించక బాహ్య ప్రపంచానికి దూరమవుతున్నారు. అత్యవసర సమయాల్లో వైద్యం కోసం వెళ్లే వారు ఉధృతంగా ప్రవహించే వాగులు దాటలేక ప్రాణాలు కోల్పోయిన సంఘటనలూ ఉన్నాయి.

అసంపూర్తిగా లక్మాపూర్‌ వంతెన

- ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోని అధికారులు, నాయకులు

కెరమెరి, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): వర్షాకాలం వచ్చిందంటే చాలు జిల్లాలో వాగులు, కల్వర్లులు ఉప్పొంగితే రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. ఏటా ఎజెన్సీ గ్రామాల ప్రజలు వర్షం పడితే బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సి వస్తోంది. సరైన రోడ్డు మార్గం లేక వాగులపై బ్రిడ్జీలు నిర్మించక బాహ్య ప్రపంచానికి దూరమవుతున్నారు. అత్యవసర సమయాల్లో వైద్యం కోసం వెళ్లే వారు ఉధృతంగా ప్రవహించే వాగులు దాటలేక ప్రాణాలు కోల్పోయిన సంఘటనలూ ఉన్నాయి. గర్భిణులను ప్రసవానికి తీసుకెళ్లే సమయాల్లో ఉప్పొంగిన వాగులు దాటలేక వాగు ఒడ్డునే ప్రసవాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. పాముకాటుకు గురైనా, అనారోగ్యంతో ఉన్నా, ఇతర ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు వరద వస్తే వారిని ఆసుపత్రికి చేర్చాలంటే నరక యాతన పడాల్సి వస్తోంది.

- ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..

ఎన్నో ఏళ్ల నుంచి వాగులపై బ్రిడ్జిలు నిర్మించక పోవడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టు కుని గిరిజనులు వాగులు దాటాల్సి వస్తోంది. భారీ వర్షాలు కురిస్తే చాలు ఆయా గ్రామాల ప్రజలు అరిగోస పడాల్సిందే. కెరమెరి మండలంలో దశాబ్ద కాలం క్రితం ప్రారంభంచిన లక్మాపూర్‌ వంతెన పనులు పూర్తి కాక పోవడంతో ఏటా వర్షాకాలంలో ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వాగులు పొంగితే ఆపద సమయంలో సాహసం చేయక తప్పడంలేదు. మండలంలోని అనార్‌పల్లి, లక్మాపూర్‌ వాగులపై వంతెనలు లేక ఆయా గ్రామాల ప్రజలు పుట్టెడు కష్టాలు పడుతున్నారు. గతంలో కురిసిన భారీ వర్షాలకు లక్మాపూర్‌ వాగు ఉప్పొంగి ప్రవహించింది. లక్మాపూర్‌ గ్రామానికి చెందిన ఓ దంపతులు ఏడాదిన్నర వయస్సు గల కుమారుడికి జ్వరం రావడంతో చికిత్స నిమిత్తం మండల కేంద్రానికి తీసుకెళ్లేందుకు అక్కడికి చేసుకున్నారు. కానీ వర్షాలకు లక్మాపూర్‌ వాగు ఆ సమయంలో ఉధృతంగా ప్రవహిస్తోంది. చేదేమి లేక ప్రమాదం అని తెలిసినప్పటికీ తన కుమారుడిని చేతిలో పైకి ఎత్తి పట్టుకుని నిండుగా ప్రవహిస్తున్న వాగును దాటుతూ మండల కేంద్రానికి చేరుకుని చికిత్స అందించారు. అలాగే మరో వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడగా అతడిని ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించే క్రమంలో గ్రామంలోని యువకులు అతడిని మంచంపై పడుకోబెట్టి వాగు దాటించిన సంఘటనలు ఉన్నాయి.

- నిలిచిపోతున్న రాకపోకలు..

భారీ వర్షాలు కురిసి వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తే లక్మాపూర్‌, అనార్‌పల్లి గ్రామాల సమీపంలో వాగు అవతలి వైపు ఉన్న కరంజీవాడ, పెద్దకరంజివాడ, జక్కాపూర్‌, బోరిలాల్‌గూడ, ఆంద్‌గూడ, శంకర్‌లొద్ది తదితర గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి రాలేక పోతున్నారు. ఆయా గ్రామాల ప్రజలు ప్రతి నిత్యం వివిధ పనుల నిమిత్తం మండల కేంద్రానికి రాకపోకలు సాగిస్తారు. ఆదివారం జరిగే వార సంతకు వచ్చి నిత్యావసర సరుకులు కొనుగోలు చేస్తారు. కానీ వాగులపై వంతెన నిర్మాణం చేపట్టక పోవడంతో వారికి రోజుల తరబడి మండల కేంద్రంతో సంబంధాలు తెగిపోయి అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో పాటు మండలంలోని సాంగ్వీ, కేలి(బి) గ్మాఆల మధ్య లో లెవల్‌ వంతెనలు ఉండడంతో వంతెన అవతలి వైపున ఉన్న కేలి(బి), కేలి(కె), పరస్‌వాడ, గౌరి, లెండిగూడ, బోలాపటార్‌తో పాటు ఇందిరానగర్‌, ఖైరి, ఆగర్‌వాడ, ఇందాపూర్‌ తదితర గ్రామాలతో పాటు మహారాష్ట్రలోని జివితి గ్రామాల ప్రజలు గంటల తరబడి వరద ఉధృతి తగ్గే వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వాగులపై వంతెనలు, లో లెవల్‌ వంతెనలు ఉన్న చోట హైలెవల్‌ వంతెనాలు నిర్మించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Jun 26 , 2025 | 11:31 PM