ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆటలాడేదెలా?

ABN, Publish Date - Jun 06 , 2025 | 01:02 AM

గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను ప్రోత్సహించి ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దడంతో పాటు ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించాలనే తలంపుతో గత ప్రభుత్వ హయాంలో ప్రతి గ్రామంలో క్రీడాప్రాంగణాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.

రాళ్లు రప్పలతో నిరుపయోగంగా దర్శనమిస్తున్న లక్ష్మీదేవిగూడెం గ్రామంలోని క్రీడా ప్రాంగణం

ఆటలాడేదెలా?

నిరుపయోగంగా క్రీడా ప్రాంగణాలు

పెరిగిన పిచ్చిమొక్కలు, కంప చెట్లు

వృథాగా క్రీడా సామగ్రి

వేములపల్లి, జూన 5 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను ప్రోత్సహించి ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దడంతో పాటు ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించాలనే తలంపుతో గత ప్రభుత్వ హయాంలో ప్రతి గ్రామంలో క్రీడాప్రాంగణాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. రెవెన్యూశాఖ మండలంలోని కొన్ని గ్రామాల్లో ప్రభుత్వ భూమిని కేటాయించగా మరికొన్ని చోట్ల అవసరమైన మేరకు భూమి లేక ఆయా పాఠశాలల ఆవరణలలో క్రీడా ప్రాంగణాలకు స్థలాన్ని కేటాయించారు. లక్షలాది రూపాయలతో భూమిని చదును చేసి మట్టి పోసి క్రీడాకారులు ఆడుకునే విధంగా వాటిని అభివృద్ధి చేశారు. అంతేకా అవసరమైన క్రీడా సామగ్రిని కూడా గ్రామపంచాయతీలకు అందించారు. కొంతకాలంగా గ్రామీణ క్రీడా ప్రాంగణాలకు అవసరమైన నిధులు కేటాయించకపోవడంతో వాటిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావడంలో అధికారులు విఫలమవుతున్నారు. దీంతో క్రీడాప్రాంగణాలు పిచ్చిమొక్కలు, గడ్డి పెరిగి నిరూపయోగంగా మారాయి. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు అనువుగా లేకపోవడంతో పిల్లలు, యువకులు పొలం గట్లపైకి వెళ్లి ఆడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రామ విస్తీర్ణాన్ని బట్టి అధికారులు క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు సమయంలోనే ఖోఖో, కబడ్డీ, వాలీబాల్‌, క్రికెట్‌ వంటి క్రీడా సామగ్రిని ఆయా గ్రామాలకు సైతం పంపిణీ చేశారు. అవి కార్యాలయాలకే పరిమితమయ్యాయి. కొన్ని క్రీడా ప్రాంగణాలను గ్రామాలకు దూరంగా ఏర్పాటు చేయడంతో క్రీడాకారులకు కాకుండా మందుబాబులకు అడ్డాలుగా మారిపోయాయి. అయినా అధికారులు, ప్రజాప్రతినిధులు వాటి వైపు కన్నెత్తి కూడా చూడటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వినియోగంలోకి తెచ్చేందుకు కృషి

మండలంలోని పలు గ్రామాల్లో ఏ ర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలను వినియోగంలోకి తెచ్చేందుకు కృషి చేస్తాం. ప్రభుత్వం నుంచి వాటి నిర్వహణకు నిధులు కేటాయించకపోవడంతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయాం. ఈ విషయాన్ని ఉన్న తాధికారుల దృష్టికి తీసుకెళ్లి అవసరమైన నిధులు మంజూరు చేసేలా కృషి చేస్తాం.

- లలిత, ఎంపీవో, వేములపల్లి

Updated Date - Jun 06 , 2025 | 01:02 AM