హోటల్ నిర్వహణ ప్రవృత్తి రచన
ABN, Publish Date - Jul 15 , 2025 | 12:37 AM
కుటుంబపరంగా వృత్తి రీత్యా హోటల్ నిర్వహిస్తూ సమయం దొరికినప్పుడల్లా పుస్తకాలను రాస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు సన్నపురెడ్డి మణుసాయితేజరెడ్డి. తనకంటూ ప్రత్యేక చాటుకోవాలనే లక్ష్యంతో ఆ యువకుడు రచనలపై మమకారం పెంచుకొని పుస్తకాలు రాస్తున్నాడు.
హోటల్ నిర్వహణ ప్రవృత్తి రచన
హోటల్ నడుపుతున్నా రచనలపై తగ్గని మమకారం
నవలలు రాస్తూ ఆదర్శంగా నిలుస్తున్న యువకుడు
మాడ్గులపల్లి, జూలై 14(ఆంధ్రజ్యోతి): కుటుంబపరంగా వృత్తి రీత్యా హోటల్ నిర్వహిస్తూ సమయం దొరికినప్పుడల్లా పుస్తకాలను రాస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు సన్నపురెడ్డి మణుసాయితేజరెడ్డి. తనకంటూ ప్రత్యేక చాటుకోవాలనే లక్ష్యంతో ఆ యువకుడు రచనలపై మమకారం పెంచుకొని పుస్తకాలు రాస్తున్నాడు. మొదటి నుంచి ఆ కుటుంబంలో రచయితలు లేకున్నా రచనలపై తనకున్న ఆసక్తి తో ఆ యువకుడిని మంచి రచయితగా నిలబెట్టింది.
తిప్పర్తి మండలంలోని సిలార్‌మియాగూడెం గ్రామంలో ఐదేళ్లుగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని హోట ల్ నిర్వహిస్తున్న సన్నపురెడ్డి సదాశివరెడ్డి విజయలక్ష్మీ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు సన్నపురెడ్డి మణుసాయితేజరెడ్డి చిన్నప్పటి నుంచి చదువులో ప్రతిభ కనబరిచేవాడు. మణుసాయితేజరెడ్డి ఎంకాం పూర్తి చేసి 2021 సంవత్సరంలో హోటల్‌ను ప్రారంభించి జీవనం కొనసాగిస్తున్నాడు.
రాస్తూ పలువురికి ఆదర్శంగా
మణుసాయిరెడ్డి రోజు హోటల్‌లో మేనేజ్‌మెంట్ పనులను చూసుకోవడమే కాక రాత్రి సమయంలో పుస్తకాలు రాయడం అలవాటుగా మార్చుకున్నాడు. దీంతో సమయం దొరికినప్పుడల్లా ఏదో అంశంపై పుస్తకం రాసేవాడు. పాఠకులకు కొత్తదనం అందించాలనే ఉద్దేశ్యంతో 2015-16లో రచయితగా కావాలనే ఆకాంక్ష ఆయన మనస్సులో మెదిలింది. అప్పటి నుం చి కథల ప్రపంచం వైపు అడుగులు వేయడం ప్రా రంభించి 2020 సంవత్సరంలో రచనా ప్రవాహంలోకి అడుగుపెట్టాడు. 2021లో ఆయన ‘చేతిలో చంద్రుడు’ అనే తొలి నవలను రాశాడు. 2022లో ‘నమహా’, 2025లో మూడవ నవల ‘ప్రయాణికుడు’ అనే పుస్తకాన్ని రాశాడు. చేతిలో చంద్రుడు అనే పుస్తకాన్ని కుటుంబంలో జరిగే ఇతివృత్తాన్ని ఉదాహరణగా తీసుకోని రాయగా, నమహా పురాణాల మీద, అదేవిధంగా ప్రయాణికుడు అనే పుస్తకాన్ని కర్మ సిద్ధాంతం మీద రాసినట్లు రచయిత పేర్కొంటున్నాడు. తాను రాసిన మూడు పుస్తకాలను పాఠకులను ఎంతో ఆకర్షించాయి. చేతిలో చంద్రుడు అనే పుస్తకం వంద కాపీలు, నమహా పుస్తకం 300 కాపీలు, ప్రయాణికుడు అనే పుస్తకం 50 వరకు పాఠకులు కొనుగోలు చేశారు. మూడవ నవల అయిన ప్రయాణికుడు మణుసాయితేజరెడ్డికి రచయితగా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఈ నవల భావోద్వేగాలతో నిండిన జీవితాన్ని మనుషుల మధ్య ఉన్న సూక్ష్మమైన బంధాలను, ప్రశ్నలతో నిండి ఉండే వ్యక్తిగత ప్రయాణాలను పుస్తకంలో పొందుపరిచారు. రచన కేవలం అభిరుచి మాత్రమే కాదు, ఆత్మాభిమానం చాటుకునేలా ఉండాలనేదే తన లక్ష్యమని రచయిత మణుసాయితేజరెడ్డి ఉద్దేశ్యం. కాగా ప్రయాణికుడు అనే నవలను ఇంగ్లీ్‌షలో తర్జుమా చేసి ఉత్తర భారతదేశ పాఠకులకు సైతం అందిస్తున్నాడు. సాయి రచించిన పుస్తకాలు అమెజాన వంటి ఆనలైన షాపింగ్ వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి.
మంచి రచనలు చేయాలనేదే నా ఆశయం
మంచి రచనలు చేసి మంచి పేరు సాధించడమే నా ఆశ యం. పురాణాల పునాదిపై ఆధారపడిన ఆధునిక గొప్ప రచనలు రాస్తాను. అక్షరాల ద్వారా ఆత్మను తాకాలనేదే నా లక్ష్యం. నారచనలద్వారా కొందరికి ఆలోచనలను, శాంతి లభించాలనేదే నా కోరిక. పాఠకుల ఆశీస్సులతో మంచి రచయితగా మారతాను. సినిమాలకు స్టోరీ అందించే అవకాశం వస్తే తప్పకుండా రాస్తాను.
- మణుసాయితేజ్‌రెడ్డి, రచయిత, తిప్పర్తి
Updated Date - Jul 15 , 2025 | 12:37 AM