సరిహద్దులో హై అలెర్ట్
ABN, Publish Date - Jul 29 , 2025 | 11:37 PM
మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో పోలీసులు హై అలెర్ట్‌ప్రకటించారు. సోమవారం నుంచి ప్రారంభమైన మావోయిస్టు పార్టీ వారోత్సవాలు ఆగస్టు 3 వరకు కొనసాగనుండడంతో సరిహద్దు ప్రాంతాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. మండలంలోని ప్రాణహిత సరిహద్దు తీర గ్రామాలతో పాటు జాతీయ రహదారిపై, అంతర్ రాష్ట్ర వంతెన వద్ద మంగళవారం పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు.
-జాతీయ రహదారిపై పోలీసుల ముమ్మర తనిఖీలు
కోటపల్లి, జూలై 29 (ఆంధ్రజ్యోతి) : మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో పోలీసులు హై అలెర్ట్‌ప్రకటించారు. సోమవారం నుంచి ప్రారంభమైన మావోయిస్టు పార్టీ వారోత్సవాలు ఆగస్టు 3 వరకు కొనసాగనుండడంతో సరిహద్దు ప్రాంతాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. మండలంలోని ప్రాణహిత సరిహద్దు తీర గ్రామాలతో పాటు జాతీయ రహదారిపై, అంతర్ రాష్ట్ర వంతెన వద్ద మంగళవారం పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చెన్నూరు రూరల్ సీఐ బన్సీలాల్, కోటపల్లి ఎస్‌ఐ రాజేందర్‌ల ఆధ్వర్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు. రాపన్‌పల్లి సమీపంలోని అంతర్‌రాష్ట్ర వంతెన వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. అనుమానితుల వివరాలను సేకరించారు. ఆటోలు, కార్లు, ద్విచక్రవాహనాలు , బస్సులను సైతం తనిఖీలు చేసి ప్రయాణికుల వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మావోయిస్టులు అడవుల్లో ఉండి హింసాత్మక ఘటనలకు పాల్పడుతూ సాధించేది ఏమిలేదని, జన జీవన స్రవంతిలో కలిసి కుటుంబీకులతో కలిసి జీవితం గడపాలన్నారు. లొంగిపోయే మావోయిస్టులకు ప్రభుత్వం అందజేస్తున్నపథకాలను పొందాలని ఆయన పేర్కొన్నారు.
Updated Date - Jul 29 , 2025 | 11:37 PM