kumaram bheem asifabad- జిల్లాలో ముసురు వాన
ABN, Publish Date - Jul 25 , 2025 | 10:34 PM
మండలంలో శుక్రవారం ముసుర వాన కురిసింది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరద ఉధృతి పెరిగి దిందా గ్రామా నికి రాకపోకలు నిలిచిపోయాయి. శివపల్లి గ్రామస్థులు సైతం ఒర్రె ఉప్పొంగి ప్రవహిస్తుం డడంతో బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
చింతలమానేపల్లి, జూలై 25 (ఆంధ్రజ్యోతి): మండలంలో శుక్రవారం ముసుర వాన కురిసింది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరద ఉధృతి పెరిగి దిందా గ్రామా నికి రాకపోకలు నిలిచిపోయాయి. శివపల్లి గ్రామస్థులు సైతం ఒర్రె ఉప్పొంగి ప్రవహిస్తుం డడంతో బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. బాబాసాగర్‌లోని నాయకప ుగూడ వాగులో నుంచి అష్ట కష్టాల మీద ప్రజలు పనులు చేసుకునేందుకు దాటాల్సిన పరిస్థితి నెలకొంది. మూడు రోజులుగా కురిసిన వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయ మయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పత్తి పంట సైతం నీట మునిగింది. కర్జెల్లి గ్రామా నికి చెందిన బాయక్క ఇల్లు రాత్రి సమయంలో వర్షానికి కూలిపోయింది. ఇల్లు కూలిన సమయంలో ఎవరు లేక పోవడంతో ప్రమాదం తప్పింది.
నిండిన పీపీరావు ప్రాజెక్టు
దహెగాం, జూలై 25 (ఆంధ్రజ్యోతి): మండలంలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కల్వాడ శివారులోని పాల్వాయి పురుషోత్తరావు ప్రాజెక్టులో భారీగా వరద నీరు చేరి నిండుకుండలా మారింది. వారం క్రితం వరకు భారీ వర్షాలు లేక పోవడంతో ప్రాజెక్టు నీరు లేక ఎండిపోయింది. ప్రసుత్తం నాలుగు రోజులుగా కురస్తున్న వర్షాలకు భారీగా వరద నీరుచేరడంతో పూర్తి స్థాయిలో నిండింది. దీంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కనువిందు చేస్తున్న బుగ్గ జలపాతం
వాంకిడి, జూలై 25 (ఆంధ్రజ్యోతి: మండలంలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు సర్కెపల్లి అటవీ ప్రాంతంలోని బుగ్గ జలపాతం కనువిండు చేస్తోంది. గుట్టపై నుంచి జాలువాతు రుతున్న నీటి ప్రవాహం పాలనురగలా కనిపిస్తూ సందర్శకులను ఆకట్టుకుంటోంది. మండల కేంద్రానికి సుమారు 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతానికి సర్కేపల్లి వరకు రోడ్డు మార్గం ఉంది. అక్కడి నుంచి మూడు కిలో మీటర్ల మేర అటవీ ప్రాంతంలో ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ జలపాతానికి సరైన రోడ్డు సదుపాయం లేక పోవడంతో సందర్శకులు వెళ్లలేక ఆచరణకు నోచుకోవడం లేదు. అటవీ ప్రాంతంలో వర్షానికి బురద మయంగా మారడంతో వాహదారులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఽఉధృతంగా ప్రవహిస్తున్న ప్రాణహిత
కౌటాల, జూలై 25 (ఆంధ్రజ్యోతి): మండల సరిహద్దులో ప్రవహిస్తున్న ప్రాణహిత ఉధృ తి పెరుగుతోంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తుమ్మిడిహెట్టి సరిహద్దలోని పుష్కరఘాట్ వరకు నీటి మట్టం చేరుకుంది. ప్రాణహిత నదిలో నాటు పడవల ద్వారా దాటే ప్రయత్నం చేయవద్దని, చేపల వేటకు వెళ్లకూడదని అధికారులు సూచిస్తున్నారు.
Updated Date - Jul 25 , 2025 | 10:34 PM