Harish Rao: రేవంత్ సర్కార్‌కు హరీష్ రావు వార్నింగ్
ABN, Publish Date - Jan 01 , 2025 | 09:38 PM
Harish Rao: రైతు భరోసా పథకాన్ని అమలు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణ క్రైమ్ రైట్ సైతం పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు.
సంగారెడ్డి, జనవరి 01: రాష్ట్రంలో 80 లక్షల మంది రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు రైతు భరోసాను సీఎం రేవంత్ రెడ్డి విజయవంతంగా ఎగ్గొట్టారన్నారు. రైతు భరోసాలో కోతలు పెట్టడానికి సీఎం, మంత్రులు కష్టపడుతున్నారని ఎద్దేవా చేశారు. బుధవారం సంగారెడ్డిలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మూడు పంటలకు రైతు భరోసా ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారని.. కానీ ఆయనే నేడు మాట మార్చారని వ్యంగ్యంగా అన్నారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి నాలుకకు నరం లేదని.. అందుకే ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో సగం మంది రైతులకు రుణమాఫీ కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా రైతు భరోసా కోసం అప్లికేషన్లు అడుగుతున్నారంటూ ఎద్దేవా చేశారు. రైతులకు బేడీలు వేసి అవమానించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రైతుల్ని దరఖాస్తుల పేరుతో దోషుల్లా చూస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు మళ్ళీ.. పైరవికారులు, కాంగ్రెస్ నాయకుల ఇళ్ల చుట్టూ తిరిగేలా చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. టింగుటింగుమని రైతు బంధు వచ్చేదని గుర్తు చేశారు. ఇప్పుడైతే రూ. 10 వేలు.. అదే తాము అధికారంలోకి వస్తే రూ. 15 వేలు అన్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదన్నారు. వరంగల్ డిక్లరేషన్ అమలు చేయాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ లీకులు ఇచ్చి కొన్ని వార్తలు రాయిస్తుందని ఆరోపించారు.
Also Read: బీర కాయలతో ఇన్ని లాభాలున్నాయా..?
పంట పండించే భూములున్న వారికి మాత్రమే రైతు భరోసా ఇస్తామంటున్నారని.. మరి దీని వల్ల పండ్ల తోటలు, ఆయిల్ పామ్, చెరుకు రైతులు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. కొండలు, గుట్టలున్న భూములకు రైతు భరోసా ఇవ్వమని అంటున్నారని పేర్కొ్న్నారు. కొండల్లో, గుట్టలో దళిత గిరిజనులు భూములు సాగు చేస్తారని గుర్తు చేశారు. దళితులు, గిరిజనులు అంటే కాంగ్రెస్ పార్టీకి పట్టదా అంటూ హరీష్ రావు ఈ సందర్భంగా కొంత అసహనం వ్యక్తం చేశారు.
Also Read: అమరావతి నిర్మాణ పనులకు టెండర్లు పిలిచిన ప్రభుత్వం
అందరికి అన్నం పెట్టే రైతును అడుక్కుతినేలా చేయకండంటూ కాంగ్రెస్ పార్టీ నేతలకు సూచించారు. జనవరి 4 వ తేదీన కేబినెట్ మీటింగ్‌లో రైతు భరోసాపై చర్చిస్తారని తెలిసిందన్నారు. ఓ వేళ ఒకే పంట పండించే భూములున్న రైతులకి రైతు భరోసా ఇవ్వకుంటే.. తస్మాత్ జాగ్రత్త అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. ఆ క్రమంలోజరగబోయే పర్యవసాలకు మీరే బాధ్యత వహించాలంటూ హెచ్చరించారు.
Also Read: సీఎం సమక్షంలో భారీగా లొంగిపోయిన మావోయిస్టులు
రూ. 2 లక్షలకుపైన రుణాలు ఉన్న రైతులకు ఎప్పుడు రుణమాఫీ చేస్తారో చెప్పాలంటూ సీఎంను డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి మాట నమ్మి రూ. 2 లక్షలపైన రుణం ఉన్న రైతులు అప్పు తెచ్చి కట్టి ఇంకా అప్పుల పాలయ్యాడన్నారు. రూ. 2 లక్షల లోపు ఉన్న సగం మంది రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. 11 సార్లు కేసీఆర్ రైతుభందు ఇచ్చారని...రైతుల సమాచారం మొత్తం ఉన్న మళ్లీ కొత్తగా అప్లికేషన్లు ఎందుకు..? అని రేవంత్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.
Also Read: భద్రత బలగాలకు తప్పిన ముప్పు.. 57 మంది మావోయిస్టు అగ్రనేతలు మృతి
తెలంగాణలో 54 లక్షల ఉపాధి హామీ కార్డులు ఉంటే ఒక కోటి 4 లక్షల మంది కూలిలు ఉన్నారని గుర్తు చేశారు. దీనిలో కూడా ఏరివేతలు మొదలుపెడుతుందంటూ కాంగ్రెస్ పార్టీపై మండి పడ్డారు. ఇది అన్యాయమన్నారు. మే నెలలో ఉపాధి హామీ పనులకు రూ. 850 కోట్లు కేంద్రం నుంచి వచ్చాయని.. ఈ నగదు కూలీలకు ఇవ్వకుండా దారి మళ్లించిందంటూ కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. మూడు నెలల్లో ఉపాధి హామీ నగదు చెల్లించక పోతే వడ్డీతో సహా తిరిగి కేంద్రానికి చెల్లించాల్సి ఉంటుందన్నారు.
Also Read: భద్రత బలగాలకు తప్పిన ముప్పు.. 57 మంది మావోయిస్టు అగ్రనేతలు మృతి
Also Read: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం
ఏడు నెలలు అయినా ఉపాధి హామీ డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలంటూ కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. ఇక తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శమని.. కానీ ఈ ఏడాది తెలంగాణలో నేరాలు రేట్ పెరిగిందని గుర్తు చేశారు. 23 శాతం నేరాలు పెరిగి తెలంగాణ ఎల్లో జోన్‌లోకి వెళ్ళిపోయిందన్నారు. ఇలాగే పరిస్థితి కొనసాగితే.. ఇంకొన్ని రోజుల్లో రెడ్ జోన్‌లోకి వెళ్ళిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులుంటే రాష్ట్రానికి ఎటువంటి పెట్టుబడులు రావన్నారు.
Also Read: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. ఎందుకంటే..
Also Read: పోలీస్ విచారణకు హాజరైన పేర్ని జయసుధ
డయల్ 100 పని తీరులో సైతం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో దారుణంగా పడిపోయిందన్నారు. క్రైమ్ డిటెక్షన్ కేసుల్లో కూడా తెలంగాణ రాష్ట్రం వెనుకపడిందని చెప్పారు. అది కూడా ఎంతగా అంటే.. బీహార్ కంటే తెలంగాణ వెనుకబడి పోయిందన్నారు. తెలంగాణ బతుకు మారుస్తానన్న రేవంత్ రెడ్డి టీఎస్‌ను TS ని TG, చిహ్నం, విగ్రహాలు, పోలీసుల లోగోలు మార్చుడు తప్ప మార్చింది ఏం లేదంటూ రేవంత్ రెడ్డి ప్యవహరశైలిపై నిప్పులు చెరిారు. సీఎం.. హోంమంత్రిగా విధులు నిర్వహిస్తున్న రేవంత్.. పూర్తిగా విఫలమయ్యారు.
For Telangana News And Telugu News
Updated Date - Jan 01 , 2025 | 09:38 PM