CRDA: అమరావతి నిర్మాణ పనులకు టెండర్లు పిలిచిన ప్రభుత్వం
ABN , Publish Date - Jan 01 , 2025 | 07:46 PM
CRDA: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెంచేందుకు చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. నిర్మాణ పనుల కోసం టెండర్లను ఆహ్వానించింది. ఈ టెండర్లకు తుది గడువు జనవరి 22 వ తేదీగా నిర్ణయించింది.
అమరావతి,జనవరి 01: రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగం పెంచడమే లక్ష్యంగా సీఆర్‌డీఏ ముందుకు వెళ్తుంది. అందులోభాగంగా అమరావతిలో పలు నిర్మాణ పనులకు ఏపీ సీఆర్‌డీఏ, అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏడీసీ) టెండర్ల పిలిచింది. రాజధాని ప్రాంతంలో పలు నిర్మాణాలకుగాను రూ. 2, 300 కోట్లకు బుధవారం టెండర్ల పిలిచింది. సీఆర్‌డీఏ ద్వారా రూ. 1470 కోట్లు, ఏడీసీ ద్వారా రూ. 852 కోట్లు టెండర్లను పలిచాయి.
ఈ నిధులతో.. పలు జోన్లలో రహదారులు, మంచినీటి సరఫరా, పవర్ తదితర ట్రంక్ ఇన్ ఫ్రా పనుల చేపట్టనున్నారు. అలాగే మరికొన్ని జోన్లలో నీరుకొండ రిజర్వాయర్‌కు సంబంధించి.. బ్యాలెన్స్ ఫ్లడ్ మిటికేషన్ నిర్మాణ పనులకు సైతం టెండర్లను పిలిచాయి. అయితే ఈ టెండర్లు వేసేందుకు తుది గడువు జనవరి 22వ తేదీగా ప్రభుత్వం నిర్ణయించింది. సంక్రాంతి వరకు సుమారు రూ. 31 వేల కోట్ల మేర నిర్మాణాలకు టెండర్లు పిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయింది. దీంతో రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మారింది. అదే సమయంలో ఏపీ అసెంబ్లీ ఎన్నిక జరిగాయి. ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటరు.. టీడీపీకి పట్టం కట్టాడు. దీంతో చంద్రబాబు సారథ్యంలో ప్రభుత్వం కొలువు తీరింది. ఆ క్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తూళ్లూరు ప్రాంతంలోని మొత్తం 29 గ్రామాలను రాజధాని ప్రాంతంగా ఎంపిక నాటి ప్రభుత్వం ఎంపిక చేసింది. దీనికి అమరావతి అని నామకరణం సైతం చేసింది. అందుకోసం రైతులను ఒప్పించి.. వారి వద్ద నుంచి భూములు తీసుకొనేందుకు నాటి చంద్రబాబు ప్రభుత్వం పెద్ద యజ్ఞమే చేసింది.
Also Read: సీఎం సమక్షంలో భారీగా లొంగిపోయిన మావోయిస్టులు
రాజధాని నిర్మాణ పనులకు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదగా శంకుస్థాపన సైతం జరిగింది. ఇక ఈ రాజధాని అమరావతికి నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సైతం అసెంబ్లీలో మద్దతు ప్రకటించారు. మరోవైపు రాజధాని నిర్మాణ పనులు సైతం ప్రారంభమయ్యాయి. ఇంతలో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు రానే వచ్చాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. దీంతో ముఖ్యమంత్రిగా ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టారు.
Also Read: భద్రత బలగాలకు తప్పిన ముప్పు.. 57 మంది మావోయిస్టు అగ్రనేతలు మృతి
అనంతరం ఏపీకి మూడు రాజధానులంటూ అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. అంతే రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు, పాదయాత్రలు చేపట్టారు. కానీ తాను పట్టి కుందేటికి మూడే కాళ్లు అన్నట్లుగా సీఎం వైఎస్ జగన్ వ్యవహరించారు. అంతేకాదు.. మూడు రాజధానులు అని ప్రకటించిన సీఎం వైఎస్ జగన్ .. ఏ ఒక్క ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయం పేరుతో ఒక్క ఇటుక రాయి వేసి శంకుస్థాపన చేయకపోవడం గమనార్హం. ఇంతలో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి.
Also Read: భద్రత బలగాలకు తప్పిన ముప్పు.. 57 మంది మావోయిస్టు అగ్రనేతలు మృతి
Also Read: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం
ఈ ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి కూటమిగా ఏర్పడి బరిలో నిలిచాయి. ఈ ఎన్నికల్లో కూటమికి ప్రజలు పట్టం కట్టారు. దీంతో చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. అనంతరం రాజధాని అమరావతి ప్రాంతంలో నిర్మాణ పనులు మళ్లీ ఊపందుకొన్నాయి.
Also Read: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. ఎందుకంటే..
Also Read: పోలీస్ విచారణకు హాజరైన పేర్ని జయసుధ
మరోవైపు.. రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ, అమిత్ షా ప్రకటించిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో రాజధాని అమరావతితోపాటు రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాలను పూర్తి చేయడం కోసం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం తనదైన శైలిలో ముందుకు దూసుకు వెళ్తుంది.
For AndhraPradesh News And Telugu News