ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Harish Rao: దండుకునేందుకే ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లు

ABN, Publish Date - May 29 , 2025 | 04:30 AM

అడ్డగోలుగా రూ.వేల కోట్లు దండుకునేందుకే.. కాంగ్రెస్‌ సర్కారు యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల పేరిట నాటకమాడుతోందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.

  • కమీషన్లు దంచడం కాంగ్రెస్‌కే చెల్లింది: హరీశ్‌రావు

హైదరాబాద్‌, మే 28 (ఆంధ్రజ్యోతి): అడ్డగోలుగా రూ.వేల కోట్లు దండుకునేందుకే.. కాంగ్రెస్‌ సర్కారు యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల పేరిట నాటకమాడుతోందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ‘జలయజ్ఞం నుంచి రెసిడెన్షియల్‌ స్కూళ్ల వరకు అంచనాలను పెంచడం, కమీషన్లు దంచడం. ఇదే కదా కాంగ్రెస్‌ మార్కు ప్రజాపాలన?’ అంటూ బుధవారం ఎక్స్‌ వేదికగా ఆయన ఎద్దేవా చేశారు. ‘20 స్కూళ్ల నిర్మాణానికి రూ.4వేల కోట్లతో పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ జీవో ఇచ్చారు.


అంటే ఒక్కో స్కూల్‌ అంచనాలను మూడు రెట్లు పెంచేశారు’అని మండిపడ్డారు. ఆకలిని తీర్చే రైతన్న వడ్లకుప్ప మీదే ఆవిరై పోవాల్సి వస్తోందని హరీశ్‌ మరో పోస్టులో ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ రైతు హంతక ప్రభుత్వమని విమర్శిస్తూ అన్నదాతల నిరసనల ఫొటోలను పంచుకున్నారు.

Updated Date - May 30 , 2025 | 02:58 PM