ఆస్తి కోసం వేధిస్తోంది
ABN, Publish Date - Jul 08 , 2025 | 12:35 AM
ఆస్తి కోసం కూతురు తల్ల్లిదండ్రులను వేధిస్తున్న సంఘటన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలో జరిగింది.
కుమార్తెపై ఆర్డీవోకు ఫిర్యాదు చేసిన తల్లి
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలో ఘటన
గరిడేపల్లి, జూలై 7(ఆంధ్రజ్యోతి): ఆస్తి కోసం కూతురు తల్ల్లిదండ్రులను వేధిస్తున్న సంఘటన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలో జరిగింది. మండలంలోని రాయినిగూడెం గ్రామానికి చెందిన కోల నాగమ్మ సోమవారం హుజూర్‌నగర్ ఆర్డీవో శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేసింది. గ్రామానికి చెందిన కోల నాగమ్మ, వెంకన్న దంపతులకు ముగ్గురు సంతానం. అందులో పెద్ద కూతురు సోమేశ్వరిని మండలంలోని పొనుగోడు గ్రామానికి చెందిన నక్క రమే్‌షతో 10సంవత్సరాల క్రితం వివాహం చేశారు. వివాహ సమయంలో తల్లిదండ్రులు కట్నంగా సోమేశ్వరికి 30గుంటల వ్యవసాయ భూమి, బంగారం, వారి స్థోమతకు తగిన విధంగా ఇచ్చి పెళ్లి చేశారు. వివాహమైన ఐదు సంవత్సరాల తర్వాత సోమేశ్వరికి సబ్ ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచి అదనంగా ఎకరం భూమి కావాలని ఒత్తిడి చేస్తున్నట్లు తల్లి కోల నాగమ్మ తెలిపారు. ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారు, నీకు అదనంగా ఎకరం ఇచ్చి మిగతా వారికి ఏమి ఇవ్వాలి, మాకు కుటుంబ పోషణ ఎలా అని తల్లిదండ్రులు సోమేశ్వరికి చెప్పారు. అయినా తన కూతురు వినకుండా తన అత్తగారి ఇంటి వాళ్లను తీసుకొచ్చి అక్రమంగా పొలం సేద్యం చేయడం, బెదిరిస్తున్నారని నాగమ్మ ఆరోపి ంచింది. అంతేకాకుండా కూతురు తండ్రికి పింఛన్ రాకుండా చేసిందని నాగమ్మ ఆరో పించింది. కష్టపడి చదివిస్తే ఉద్యోగం వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు ఆసరాగా ఉం టూ వారి బాగోగులు చూసుకోవాల్సిన కూతురే ఇలా ఆస్తి కోసం వేధిస్తోందని తమ కుటుం బానికి రక్షణ కావాలంటూ ఆర్డీవోను వేడుకున్నట్లు తల్లి నాగమ్మ తెలిపారు.
Updated Date - Jul 08 , 2025 | 06:33 AM