Hanish Reddy: సత్తాచాటిన కందనెల్లి బాలుడు
ABN, Publish Date - May 25 , 2025 | 04:55 AM
వికారాబాద్ జిల్లా కందనెల్లి గ్రామానికి చెందిన హనీశ్ రెడ్డి ఆలిండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో రాష్ట్రస్థాయిలో నాలుగో ర్యాంకు సాధించాడు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అతడిని హైదరాబాద్‌లో అభినందించారు.
సైనిక్‌స్కూల్ ప్రవేశ పరీక్షలో నాలుగో ర్యాంక్
అభినందించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
పెద్దేముల్, మే 24 (ఆంధ్రజ్యోతి): ఆలిండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో వికారాబాద్ జిల్లా కందనెల్లి గ్రామానికి చెందిన హనీశ్ రెడ్డి రాష్ట్రస్థాయిలో నాలుగో ర్యాంక్ సాధించాడు. కందనెల్లికి చెందిన తోపోజి రాంరెడ్డి, రాధిక దంపతుల కుమారుడు హనీశ్ రెడ్డి.. హైదరాబాద్‌లోని రేయాన్స్ సైనిక్ స్కూల్లో ఐదో తరగతి చదువుతున్నాడు. ఇటీవల నిర్వహించిన ఆలిండియా సైనిక్‌స్కూల్ ప్రవేశ పరీక్షలో నాలుగో ర్యాంకు సాధించాడు. ఈ సందర్భంగా అతడిని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌లో అభినందించారు. హనీశ్ ఇలాంటి విజయాలు ఎన్నో సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కిషన్ రెడ్డి ఆకాంక్షించారు.
ఇవి కూడా చదవండి
Vijayawada Durgamma: దుర్గగుడిలో భక్తుల రద్దీ.. కీలక నిర్ణయం తీసుకున్న EO
Husband And Wife: సెల్‌ఫోన్‌లో పాటలు.. సౌండ్ తగ్గించమన్నందుకు భార్యపై దారుణం..
Updated Date - May 25 , 2025 | 04:55 AM