ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆరోగ్యశ్రీ సేవల్లో చేతివాటం

ABN, Publish Date - Jul 10 , 2025 | 12:43 AM

గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య చేసి బిల్లులు పొందుతూనే అదనపు వసూళ్లకు పాల్పడుతున్న ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి వ్యవహారాన్ని అధికారుల బట్టబయలు చేశారు.

విచారణ నిర్వహిస్తున్న ఆరోగ్య జిల్లా కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ శివప్రసాద్‌

మిర్యాలగూడ అర్బన్‌, జూలై 9(ఆంధ్రజ్యోతి): గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య చేసి బిల్లులు పొందుతూనే అదనపు వసూళ్లకు పాల్పడుతున్న ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి వ్యవహారాన్ని అధికారుల బట్టబయలు చేశారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం డాక్టర్స్‌ కాలనీలోని రివర్‌ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ జిల్లా అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఇన్‌పేషంట్‌ వార్డులో చికిత్సపొందుతున్న రోగులను ఆరా తీశారు. ఆరోగ్యశ్రీ పథకం కింద అం దిస్తున్న ఉచిత వైద్య సేవలపై ప్రశ్నించగా ఆస్పత్రి యాజమాన్యం ప్రభుత్వం చెల్లించే బిల్లులతోపాటు అదనంగా బిల్లులు వసూలు చేస్తున్నట్లు అధికారుల వద్ద వాపోయారు. గుండె సంబంధిత జబ్బులకు అందించే వైద్యాన్ని బట్టి చేతివాటం ప్రదర్శిస్తున్నారని రోగుల బంధువులు అధికారుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాపాయ పరిస్థితిలో చికిత్స కోసం తీసుకొచ్చిన తాము వారిని ప్రాణాలతో దక్కించుకునేందుకు యాజమాన్యం విధించే షరతులకు తలొగ్గాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా గుండెపోటుతో ఆస్పత్రిలో చికిత్సకోసం వచ్చిన రోగుల బంధువులను ఆరోగ్యశ్రీలో వేసే స్టంట్లు నాసిరకంగా ఉన్నాయని భయబ్రాంతులకు గురిచేసి ప్రైవేట్‌ స్టంట్లు వేస్తూ అదనపు బిల్లులు నొక్కేస్తున్నట్లు అధికారులు తమ తనిఖీలో గుర్తించారు. మేలిరకం కంపెనీ స్టంట్ల పేరుతో ఆరోగ్యశ్రీ వార్డులోని రోగుల నుంచి అదనపు వసూళ్లకు సంబంధించి బిల్లులు కూడా ఇవ్వడంలేదని పలువురు విచారణ అధికారులకు తెలిపారు. ఆస్ప త్రి అందిస్తున్న వైద్యసేవలు, అదపను వసూళ్లపై రోగులు, వారి సహాయకుల నుంచి సేకరించిన వాంగ్మూలాన్ని అధికారులు రికార్డు చేసుకున్నారు. ఆరోగ్యశ్రీ పథకం నిబంధనలు తుంగలో తొక్కి, ఇష్టానుసారంగా వ్యహరిస్తున్న ఆస్పత్రి యాజమాన్యానికి అధికారులు షోకాజ్‌ నోటీసులు జారీచేశారు. వారం రోజుల్లోపు లిఖిత పూర్వకంగా వివరణ వివ్వాలని అధికారులు ఆదేశించారు.

మృతుడి బంధువుల ఫిర్యాదుతో..

ఈ నెల 1వ తేదీన ఆడవిదేవులపల్లి మండలం కొత్తనందికొండ గ్రామానికి చెందిన సుంకిశాల ముత్తయ్య(60) గుండెనొప్పితో రివర్‌ ఆస్పత్రిలో చేరగా, ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యసేవలు అందించాల్సిన ఆస్పత్రి యాజమాన్యం అదనపు డబ్బులు డిమాండ్‌ చేయగా, ఆ మొత్తం చెల్లించక పోవడంతో చికిత్సలో జాప్యం జరిగి మృతిచెందాడని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. ఆస్పత్రి యాజమాన్యం తీరుపై మృతుడి బంధువులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడంతో చేపట్టిన తనిఖీలో ఆస్పత్రి బండారం బట్టబయలైంది. రోగి మృతికి ఆస్పత్రి నిర్వాహకుల నిర్లక్ష్యం కారణమని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఆస్పత్రి యాజమాన్యం ఇచ్చే వివరణ ఆధారంగా రాష్ట్ర ఆరోగ్యశ్రీ ట్రస్టు పూర్తిస్థాయి నివేదిక అందజేస్తామని జిల్లా కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ శివప్రసాద్‌ తెలిపారు.

Updated Date - Jul 10 , 2025 | 12:43 AM