kumaram bheem asifabad- ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు
ABN, Publish Date - Jul 10 , 2025 | 11:29 PM
ఆసిఫాబాద్ పట్టణంలో గురుపౌర్ణమి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. స్థానిక సాయిబాబా అలయంలో అర్చకులు మధుకర్‌శర్మ, సాయిల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. గత వారం రోజుల నుంచి ఆలయంలో గురుచరిత్ర పారాయణం నిర్వహించారు. సాయంత్రం పల్లకిసేవ నిర్వహించారు. సరస్వతి శిశు మందిర్‌లో గురుపౌర్ణమి వేడుకలను నిర్వహించారు.
ఆసిఫాబాద్‌రూరల్, జూలై 10(ఆంధ్రజ్యోతి): ఆసిఫాబాద్ పట్టణంలో గురుపౌర్ణమి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. స్థానిక సాయిబాబా అలయంలో అర్చకులు మధుకర్‌శర్మ, సాయిల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. గత వారం రోజుల నుంచి ఆలయంలో గురుచరిత్ర పారాయణం నిర్వహించారు. సాయంత్రం పల్లకిసేవ నిర్వహించారు. సరస్వతి శిశు మందిర్‌లో గురుపౌర్ణమి వేడుకలను నిర్వహించారు. వ్యాసమహర్షి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురుపౌర్ణమి విశిష్ఠతను విద్యార్థులకు తెలియజేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎం కోటేశ్వర్, ఉపాధ్యాయులు శారద, అమరావతి, సత్యనారయణ, శ్రీకాంత్, పాఠశాల కమిటీ సభ్యులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కాగజ్‌నగర్, (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్ పట్టణంలో గురువారం గురుపౌర్ణమి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠాలు బోధించిన గురువులను ఘనంగా సన్మానించారు. అన్నీ ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రబంధకారిని అధ్యక్షులు చిలువేరు ప్రవీణ్, కార్యదర్శి కొడిపాక సత్యనారాయణ, రిటైర్డు ఎంఈఓ వినోద్, భవానీ, రోజా, ధనలక్ష్మి, శ్రావణి, లావణ్య, ఊర్మిళ, సాగర్, శ్రావణి సిబ్బంది పాల్గొన్నారు. అలాగే పట్టణంలో శ్రీ దేవానంద స్వామి ఆశ్రమంలో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురు పాదుకలకు పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.
కాగజ్‌నగర్ టౌన్, (ఆంధ్రజ్యోతి): శ్రీసత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో గురుపూర్ణిమ సంధర్భంగా గురువారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సిర్పూర్ పేపర్ మిల్లు ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయగా జీ.ఎం ఎం ఎస్ గిరి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే పాల్వాయి రాజ్యలక్ష్మి, సేవా సమితి భక్తులు పాల్గొన్నారు.
సిర్పూర్(యు), (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో గల హన్మన్-సాయిబాబా ఆలయంలో ఉదయం నుంచే భక్తులు గురు షౌర్ణిమ పూజలు నిర్వహించారు. జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మేత విశ్వనాథ్‌రావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆత్రం భగవంత్‌రావు, నాయకులు తోడసం ధర్మరావు, మాజీ సర్పంచ్ ఆర్క నాగోరావు, అనిల్‌కుమార్ సాయిబాబా ఆలయంలో మొక్కులు చెల్లించుకున్నారు. మహగాంలో సంత్ సురోజీ బాబా శిష్యులు పాల్గొని పూజలు చేశారు.
చింతలమానేపల్లి, (ఆంధ్రజ్యోతి): మండలంలోని కర్జవెల్లి గ్రామంలో ఓంకార ఆశ్రమం, రాధాకృష్ణ మందిరంలో గురువారం గురు పౌర్ణమి వేడుకలను భక్తులు ఘనంగా జరుపుకున్నారు. మహాభారత రచయిత మహార్షి వేద వ్యాసుని జన్మదినోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు.
కౌటాల,(ఆంద్రజ్యోతి): మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో గురువారం గురు పౌర్ణమిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో భక్తులు కనకయ్య, సత్తయ్య, శైలేష్, వినాయక్‌గౌడ్, ఉమేష్‌గౌడ్, రవి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 10 , 2025 | 11:29 PM