నడకదారిలో గ్రిల్స్ మాయం?
ABN, Publish Date - Jun 03 , 2025 | 12:36 AM
నల్లగొండ పట్టణ సుందరీకరణలో భాగంగా రెండేళ్ల క్రితం పలు ప్రధాన రహదారుల్లో పాదచారుల సౌకర్యార్థం అప్పటి అధికారులు ప్రత్యేక నడకదారిని ఏర్పా టు చేశారు.
నడకదారిలో గ్రిల్స్ మాయం?
వ్యాపార అవసరాల కోసం ధ్వంసం
చోరీకి గురవుతున్న లక్షల విలువైన ఐరన గ్రిల్స్
పట్టించుకోని మునిసిపల్ యంత్రాంగం
రామగిరి, జూన 2(ఆంధ్రజ్యోతి): నల్లగొండ పట్టణ సుందరీకరణలో భాగంగా రెండేళ్ల క్రితం పలు ప్రధాన రహదారుల్లో పాదచారుల సౌకర్యార్థం అప్పటి అధికారులు ప్రత్యేక నడకదారిని ఏర్పా టు చేశారు. పాదచారులకు వాహనదారుల నుంచి ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక మా ర్గాన్ని డీఈవో కార్యాలయం నుంచి సాగర్ రోడ్డు వరకు ఏర్పాటు చేశారు. దానికి ఒక వైపు ఐరనతో తయారు చేసిన గ్రిల్స్‌ను ఏర్పా టు చేశారు. ఇదే క్రమంలో వ్యాపార సంస్థల వద్ద అటు వ్యాపారులకు, ఇటు వినియోగదారులకు ఇబ్బందులు ఎదురుకాకుండా స్థలాన్ని వదులుతూ ఐరన గ్రిల్స్‌ను ఏర్పాటు చేశారు. ఈవిధానాన్ని ఏర్పాటుచేసిన అధికారులు ఇక్కడ ఉన్నంత వరకు ఈ గ్రిల్స్ జోలికి వెళ్లేందుకు ఏ ఒక్కరు సాహిసించలేదు.అయితే ఆఅధికారి బది లీ కావడంతో దేవరకొండ రోడ్డులో గల కొందరు వ్యాపారులు నడకదారిని యథేచ్ఛగా కబ్జా చేసి వ్యాపారులు నిర్వహించుకుంటున్నారు.
అంతేకాక తమ వ్యాపారాలకు అడ్డుగా ఉన్నాయంటూ అక్కడఉండే ఐరనగ్రిల్స్‌ను ధ్వంసం చేస్తున్నారు. మరికొంత మంది వ్యాపారులు అయితే ఈ గ్రిల్స్ ఇక్కడ ఉంటే తమ వ్యాపారా లు సాగడం లేదని, రాకపోకలకు ఇబ్బంది అవుతుందని, తమ వాహనాలు దుకాణాల ముందు కు తీసుకొచ్చేందుకు వీలు పడటం లేదన్న కారణాలతో అక్కడ ఉన్న గ్రిల్స్‌ను పూర్తిగా తొలగిస్తున్నట్లు ఆరోపణలు వెలువెత్తున్నాయి.
నడకదారిపై యథేచ్ఛగా వ్యాపారాలు
నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డుకు ఇరువైపులా వేసిన నడకదారిని అక్కడ వ్యాపారులు యథేచ్ఛగా ఆక్రమించుకొని వ్యాపారాలు నిర్వహించకుంటున్నారు. ప్రధానంగా హోటల్ నిర్వాహకులు, పండ్ల, బండ్ల నిర్వాహకులు, బైక్ మెకానిక్‌లు వారితో పాటు ఇతర వ్యాపారులు నడక దారిని ఆక్రమించేశారు.
ఓ ఇంటి యజమాని అయితే అక్కడ నడకదారి కనిపించకుండా పూర్తిగా తన వాకిలి పరిసరాలుగా మార్చుకున్నాడు. దీంతో పదచారులు రోడ్డు నుంచి నడుచుకుంటూ ఇబ్బందులు పడక తప్పడం లేదు. పట్టించుకోని మునిసిపల్ యంత్రాంగం
పాదచారుల సౌకర్యార్థం రూ.లక్షల్లో ఖర్చు చేసి ఐరనతో తయారుచేసిన గ్రిల్స్ ధ్వంసమవుతుంటే పట్టించుకోవాల్సిన మునిసిపల్ యంత్రాంగం అటు వైపు కన్నెత్తి కూడా చూడ టం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు పాదచారుల కోసం ఏర్పాటు చేసిన నడకదారిని ఆక్రమించి వ్యాపారాలు నిర్వహించుకుంటుండటంతో తప్పని పరిస్థితిలో పాదచారులు రోడ్డుపైనే నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పాదచారులు ప్ర మాదాలకు గురవుతున్న సంఘటలను ఉన్నా యి. ఇప్పటికైనా మునిసిపల్ యంత్రాంగం స్పందించి ఐరన గ్రిల్స్‌ను ధ్వంసం చేసిన వారి ని గుర్తించి, వారి నుంచి నష్టపరిహారాన్ని రికవరీ చేసి ప్రజాధనాన్ని కాపాడాలని పలువు రు పట్టణ ప్రజలు కోరుతున్నారు.
విచారించి చర్యలు తీసుకుంటాం
ఐరన గ్రిల్స్ ధ్వంసం చేసిన వారిని గుర్తించి వారిపై చట్టరీత్యా చర్య లు తీసుకుంటాం. అంతేకాకుండా వారి నుంచి జరిగిన నష్టాన్ని రికవరీ చేయడంతో పాటు పోలీస్ కేసు కూడా నమోదు చేస్తాం.
- సయ్యద్ ముసాబ్ అహ్మద్, మునిసిపల్ కమిషనర్
Updated Date - Jun 03 , 2025 | 12:36 AM