కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం వెంటనే తరలించాలి
ABN, Publish Date - May 23 , 2025 | 11:37 PM
అకాల వర్షాల దృష్య్టా వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన కేటాయించిన ప్రకారం రైసుమిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు.
కలెక్టర్ కుమార్‌దీపక్
జైపూర్, మే 23 (ఆంధ్రజ్యోతి) : అకాల వర్షాల దృష్య్టా వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన కేటాయించిన ప్రకారం రైసుమిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని ముదిగుంట, జైపూర్, శెట్‌పల్లి, కుందారం, వేలాల, కిష్టాపూర్ , పౌనూరు గ్రామాల్లోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ వనజారెడ్డితో కలిసి సందర్శించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో నిబంధనల ప్రకారం రైతుల వద్ద నుంచి నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామన్నారు. అకాల వర్షాలు కురుస్తున్న దృష్య్టా కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైసు మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సన్నరకం వడ్లకు మద్దతు ధరతో పాటు రూ. 500 బోనస్ ప్రభుత్వం అందిస్తుందన్నారు. కేంద్రాల్లో రైతులకు నీడ, తాగునీరు, ఓఆర్‌ఎస్ అందుబాటులో ఉంచడంతో పాటు అవసరమైన గోనె సంచులు, టార్పాలిన్‌లను సమకూర్చడం జరిగిందన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైసుమిల్లులకు తరలించాలన్నారు. నిర్ధేశిత లక్ష్యాన్ని పూర్తి చేసిన కేంద్రాలను మూసివేశామన్నారు. కేంద్రాల నిర్వహకులు హమాలీల కొరత లేకుండా చూసుకోవాలని, హమాలీల సమయానికి అనుగుణంగా ధాన్యాన్ని లారీల్లో నింపి తరలించాలన్నారు. కాంటా వేసిన ధాన్యాన్ని వెంట వెంటనే మిల్లులకు పంపించాలన్నారు. ఈ నెల 25 వరకు కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం నిల్వలు ఉం డకూడదని పేర్కొన్నారు. కలెక్టర్ వెంట ఐకేపీ ఏపీఎం రాజ్‌కుమార్ ఉన్నారు.
కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి
మంచిర్యాలకలెక్టరేట్: రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని బీమారం మండలం పొలంపల్లి, భీమారం, అక్కపల్లి, అంకూసపూర్ గ్రామాలలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి దాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు.ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో దాన్యం ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Updated Date - May 23 , 2025 | 11:37 PM