ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఫ్యూచర్‌ సిటీ మ్యాప్‌ ఇదీ!

ABN, Publish Date - Mar 08 , 2025 | 03:43 AM

ఫ్యూచర్‌ సిటీని 765.28 చ.కి.మీ విస్తీర్ణంలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహేశ్వరం, ఆమనగల్‌, కడ్తాల్‌, కందుకూరు, ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల మండలాలు ఫ్యూచర్‌ సిటీ పరిధిలోకి రానున్నాయి.

  • 765 చ.కి.మీ విస్తీర్ణంలో నిర్మాణం.. పరిధిలో 7 మండలాలు.. 56 గ్రామాలు

  • వీటితో ఫ్యూచర్‌సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ.. సర్కారు నిర్ణయం

హైదరాబాద్‌, మార్చి 7(ఆంధ్రజ్యోతి): ఫ్యూచర్‌ సిటీని 765.28 చ.కి.మీ విస్తీర్ణంలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహేశ్వరం, ఆమనగల్‌, కడ్తాల్‌, కందుకూరు, ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల మండలాలు ఫ్యూచర్‌ సిటీ పరిధిలోకి రానున్నాయి. ఈ 7 మండలాల్లోని 56 గ్రామాలతో ఫ్యూచర్‌సిటీ డెవపల్‌మెంట్‌ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) ఏర్పాటు కానుంది. ఆమనగల్లులో 2 గ్రామాలు, మహేశ్వరం నుంచి 2 గ్రామాలు, మంచాల నుంచి 3 గ్రామాలు, ఇబ్రహీంపట్నంలో 8 గ్రామాలు, కడ్తాల్లోని 6 గ్రామాలు, యాచారం నుంచి 17 గ్రామాలు, కందుకూరు నుంచి 18 గ్రామాలు క్యాబినెట్‌ ఆమోదంతో ఇకపై ఫ్యూచర్‌ సిటీ పరిధిలోకి రానున్నాయి. ఇక ఫ్యూచర్‌ సిటీ డెవల్‌పమెంట్‌ అథారిటీ కమిషనర్‌గా ఓ ఐఏఎస్‌ అధికారిని ప్రభుత్వం నియమించనుంది.


ఇందుకుగాను ఐఏఎస్‌ అధికారులు కే శశాంక, ఎస్‌.హరీశ్‌, బీ గోపి పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఎఫ్‌సీడీను ఏర్పాటు చేస్తూ మంత్రివర్గ సమావేశం ఇటివలే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా కాగా ఎఫ్‌డీసీఏ కోసం కొత్తగా 90 పోస్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వీటిలో 34 రెగ్యులర్‌ పోస్టులు కాగా, మిగిలిన 56 పోస్టులను ఔట్‌ సోర్సింగ్‌ పద్థతిలో భర్తీ చేస్తారు. ఇక.. శాసనసభ సమావేశాలు ఈనెల 12 నుంచి జరగనున్నాయి. ఈ మేరకు గవర్నర్‌ ఆమోదంతో అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.


ఇవి కూడా చదవండి...

CM Revanth Reddy: సొల్లు మాటలు వద్దు.. ఆధారాలతో చూపించండి

Telangana: మేడిగడ్డ వ్యవహారం.. కేసీఆర్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్..

TGSRTC: భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీజీఎస్‌ఆర్టీసీ.. ఆరోజు ఏకంగా 3 వేల బస్సులు..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 08 , 2025 | 03:43 AM