విద్యారంగం బలోపేతానికి ప్రభుత్వం చర్యలు
ABN, Publish Date - Jul 03 , 2025 | 11:56 PM
విద్యా రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని పౌనూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభు త్వ ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, విద్యాబోధన, మధ్యాహ్న భోజన సదుపాయాలను పరిశీలించారు.
కలెక్టర్ కుమార్ దీపక్
జైపూర్, జూలై 3 (ఆంధ్రజ్యోతి) : విద్యా రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని పౌనూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభు త్వ ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, విద్యాబోధన, మధ్యాహ్న భోజన సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆద్వర్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ర్థులకు అన్ని సౌకర్యాలు కల్పించిందన్నారు. మెను ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిం చాలన్నారు. తాజా కూరగాయాలతో భోజనం త యారు చేయాలని, శుద్ధమైన నీటిని అందించాల న్నారు. బడి బయట పిల్లలు, మధ్యలో బడిమా నేసిన పిల్లలను గుర్తించి వారు పాఠశాలలకు వ చ్చేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. అంగ న్‌వాడీ కేంద్రాల్లో పిల్లల ఎత్తు, బరువు కొలత లు స్వయంగా పరిశీలించారు. శివ్వారం గ్రామంలో ప్ర భుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి తరగతి గదులు, వంటశాలను పరిశీలించి ఉపా ధ్యాయుల కు పలు సూచనలు చేశారు. గ్రామంలో కొనసాగు తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీ లించి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. డీసీఎంఎల్ ఫర్మార్ సర్వీసు సెంటర్‌ను సందర్శించి ఎరువులు, విత్తనా లస్టాకు నిల్వలు, రిజిరష్టర్‌లను పరిశీలించారు. అ నంతరం గంగిపెల్లి గ్రామంలో ఇంది రమ్మ ఇంటి నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భూ సమస్యలపై ప్రభుత్వం నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో అం దిన దరఖాస్తులను పరిశీలించి రికార్డులతో సరి చూసి త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకో వాలన్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ వనజారెడ్డి, ఎంపీడీవో సత్యనారాయణ, ఎంపీవో శ్రీపతి బాపురావు ఉన్నారు.
Updated Date - Jul 03 , 2025 | 11:56 PM