kumaram bheem asifabad- జీవో 49ని నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
ABN, Publish Date - Jul 21 , 2025 | 11:21 PM
కుమరంభీం జిల్లా టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 49ని సోమవారం నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. పులుల కారిడార్, కవ్వాల్ అభయారణ్యంలో భాగంగా ఉన్న ఆసిఫాబాద్ ప్రాంతాన్ని కుమరంభీం టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్‌గా ప్రకటిస్తూ గతనెల 30 అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆహ్మద్ నదీం జీవో 49 జారీ చేశారు. ఈ జీవో ద్వారా జిల్లాలోని ఆసిఫాబాద్, కెరమెరి, రెబ్బెన, తిర్యాణి, కాగజ్‌నగర్, సిర్పూర్(టి), కర్జెల్లీ, బెజ్జూరు, పెంచికల్‌పేట రేంజ్‌ల పరిధిలో 1,49,288 హెక్టార్లను టైగర్ రిజర్వ్‌లోకి మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. జీవో విడుదలైన రోజు నుంచి దీన్ని వ్యతిరేకిస్తూ ఆదివాసీ సంఘాలు ఆందోళనలు చేపడుతున్నాయి.
ఆసిఫాబాద్, జూలై 21 (ఆంధ్రజ్యోతి): కుమరంభీం జిల్లా టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 49ని సోమవారం నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. పులుల కారిడార్, కవ్వాల్ అభయారణ్యంలో భాగంగా ఉన్న ఆసిఫాబాద్ ప్రాంతాన్ని కుమరంభీం టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్‌గా ప్రకటిస్తూ గతనెల 30 అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆహ్మద్ నదీం జీవో 49 జారీ చేశారు. ఈ జీవో ద్వారా జిల్లాలోని ఆసిఫాబాద్, కెరమెరి, రెబ్బెన, తిర్యాణి, కాగజ్‌నగర్, సిర్పూర్(టి), కర్జెల్లీ, బెజ్జూరు, పెంచికల్‌పేట రేంజ్‌ల పరిధిలో 1,49,288 హెక్టార్లను టైగర్ రిజర్వ్‌లోకి మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. జీవో విడుదలైన రోజు నుంచి దీన్ని వ్యతిరేకిస్తూ ఆదివాసీ సంఘాలు ఆందోళనలు చేపడుతున్నాయి. జీవో 49పై ఆదివాసీల్లో అనుమానాలు, అభ్యం తరాలు నెలకొన్న నేపథ్యంలో పలుమార్లు మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, కొండ సురేఖ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అటవీశాఖ అదికారులు, స్థానిక ప్రజాప్రతిని ధులతో మంత్రులు సమావేశాలు నిర్వహించి పూర్తి వివరాలు సేకరించారు. ఈ పరిణామాల దృష్ట్యా జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే నుంచి తాజాగా నివేదికలు తెప్పిం చుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం జీవో 49ని నిలుపుదల చేసేందుకు నిర్ణయించి అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆహ్మద్ నదీం జీవో 49ని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జీవో 49 రద్దు చేయడం హర్షణీయమని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజాప్రతినిదులు అన్నారు. జీవో 49 రద్దు చేయడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ దండె విఠల్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, మాజీ ఎంపీ సోయం బాబురావు, మాజీ ఎమ్మెల్యే అత్రం సక్కులు జీవో 49 రద్దుకు సహకరించిన మంత్రులు సీతక్క, కృష్ణారావు, కొండ సురేఖ, లక్ష్మణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు ముఖ్యమంత్రిని ఆయన కార్యాలయంలో కలిసి సన్మానించారు.
Updated Date - Jul 21 , 2025 | 11:21 PM