విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
ABN, Publish Date - Apr 16 , 2025 | 11:35 PM
విద్యాభివృద్ధికి సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి నా యకత్వంలోని కాంగ్రెస్ ప్రభు త్వం పెద్దపీట వేస్తుందని కల్వకు ర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణ రెడ్డి తెలిపారు.
- కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి
కల్వకుర్తి, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి) : విద్యాభివృద్ధికి సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి నా యకత్వంలోని కాంగ్రెస్ ప్రభు త్వం పెద్దపీట వేస్తుందని కల్వకు ర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ పాఠశా లలను, గురుకులాలను బలోపే తం చేసి నాణ్యమైన విద్య అందే లా చూస్తున్నామని ఆయన పేర్కొ న్నారు. కల్వకుర్తి మండల పరిధి లోని తాండ్రా గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిన్నతనంలో విద్యాభ్యాసం చేశారని, తాను చదివిన పాఠశాలకు రూ.5కోట్లు మంజూరు చేశారని గుర్తు చేశారు. బుధవారం భవన ని ర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. అ నంతరం జైబాపు, జైభీమ్, జై సంవిధాన్ కార్య క్రమంలో భాగంగా గ్రామంలో పర్యటించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిం చారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఠాకూ ర్ బాలాజీసింగ్, కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్‌కుమార్‌రెడ్డి, ప్రముఖ గాయకు డు వేపూర్ సోమన్న, కాంగ్రెస్ రాష్ట్ర నాయకు లు కాయితీ ఆశాదీప్‌రెడ్డి, కాయితీ సాయిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాయితీ విజయ్ కు మార్‌రెడ్డి, నాయకులు సంజీవ్‌కుమార్ యాద వ్, నాయకులు ఉన్నారు.
పాఠశాలలో అభివృద్ధి పనులకు భూమి పూజ
వెల్దండ : బుధవారం మండల కేంద్రంలోని కేజీబీవీ, బాలుర ఉన్నతపాఠశాల, మోడల్‌స్కూళ్లలో రూ.5 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి భూమిపూజ చేశారు. కార్యక్రమంలో పీసీబీ సభ్యుడు బాలాజీసింగ్, డీఈవో రమేష్‌కుమార్, పీఏసీఎస్ డైరెక్టర్లు వెంకటయ్యగౌడ్, సంజీవ్‌కుమార్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోతీలాల్, నాయకులు భూపతిరెడ్డి, రషీద్, ఎర్రశ్రీను ఉన్నారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ
కల్వకుర్తి : కల్వకుర్తి పట్టణానికి చెందిన అర వింద్‌చారి, కార్తీక్‌చారిలు మంగళవారం రాత్రి డిండి మండలం ఎర్రకుంటపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించి వారి మృతదేహాలపై పూల మాలలు వేసి నివాళుల ర్పించారు. ఆయన వెంట మాజీ జడ్పీవైస్ చైర్మన్ ఠాకూర్ బాలాజీసింగ్, మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్‌కుమార్, పలువురు నాయకులు తదితరులు ఉన్నారు.
Updated Date - Apr 16 , 2025 | 11:36 PM