ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వానాకాలం సాగుకు సన్నద్ధం..

ABN, Publish Date - May 04 , 2025 | 11:32 PM

వానాకాలం సాగుకు అన్నదాతలను సమాయత్తం చేసేందుకు వ్యవసాయశాఖ ప్రణాళికలను సిద్ధం చేసింది. ఈ నెల 25వ తేదీ నుంచి రోహిణి కార్తె ప్రారంభం సం దర్భంగా రైతులు వానాకాలం సాగుకు సిద్ధమవుతు న్నారు.

-ప్రణాళిక ఖరారు చేసిన వ్యవసాయశాఖ

-నేటి నుంచి రైతులకు ప్రత్యేక కార్యక్రమాలు

-జిల్లాలో అవగాహన కల్పించనున్న శాస్త్రవేత్తలు

-కల్తీ విత్తనాలు, పురుగు మందులపై సలహాలు

మంచిర్యాల, మే 5 (ఆంధ్రజ్యోతి): వానాకాలం సాగుకు అన్నదాతలను సమాయత్తం చేసేందుకు వ్యవసాయశాఖ ప్రణాళికలను సిద్ధం చేసింది. ఈ నెల 25వ తేదీ నుంచి రోహిణి కార్తె ప్రారంభం సం దర్భంగా రైతులు వానాకాలం సాగుకు సిద్ధమవుతు న్నారు. అందుకు అనుగుణంగా జిల్లాలో సాగు విస్తీ ర్ణం, వివిధ పంటల సాగు, ఎరువుల అవసరంపై వ్య వసాయశాఖ అధికారులు సన్నద్ధం అవుతున్నారు. అ లాగే వివిధ రకాల పంటల సాగు పద్ధతులు, నకిలీ విత్తనాల వల్ల దుష్ప్రభావం, ఎరువుల వాడకంపై రై తులకు ప్రత్యేకంగా అవగాహన కల్పించేందుకు కూ డా వ్యవసాయశాఖ ప్రత్యేక కార్యాచరణ ప్రత్యేక కా ర్యాచరణను రూపొందించుకుంది.

మూడు లక్షల ఎకరాల్లో వానాకాలం సాగు...

2024-25 సంవత్సరానికి సంబంధించి జిల్లాలో వా నాకాలం సీజన్‌లో 3,33,565 ఎకరాల్లో పంటలు సాగ వుతాయని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. వా నాకాలం సాగులో ప్రధానంగా జీలుగ, వరి, పత్తి, కం ది, మొక్కజొన్న, పెసలు, మినుము పంటలు పం డించే అవకాశాలు ఉన్నాయి. జీలుగ 37,845 ఎకరా ల్లో సాగు కానుండగా, వరి లక్షా 58,151 ఎకరాలు, పత్తి లక్షా 58,753 ఎకరాలు, కంది 1054 ఎకరాలు, మొక్కజొన్న 531 ఎకరాలు, పెసలు 116 ఎకరాలు, మినుములు 69 ఎకరాలు, ఇతర 250 ఎకరాల్లో సాగు కానున్నాయి.

నేటి నుంచి అవగాహన సదస్సులు....

నూతన వ్యవసాయ పద్ధతులు, సాగు విషయా లపై ఈ నెల 5వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా రైతు లకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయనున్నారు. అందులో భాగంగా ఆచార్య జయశంకర్‌ తెలంగాణ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలను రైతుల ముంగిట్లోకి తీసుకురానున్నారు. రైతు వేదికలు ఇందుకు వేదిక కానున్నాయి. జిల్లాలోని అన్ని మండలాల్లోని రైతు వేదికల్లో శాస్త్రవేత్తలు రైతులకు ముఖాముఖి అవగా హన కల్పించనున్నారు. ఇందుకు సంభందించి జిల్లా వ్యవసాయశాఖ అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే జిల్లాలో రైతులు వానకాలం సాగు కు పొలాలను సిద్ధం చేసుకొని ఉండగా, నేరుగా శా స్త్రవేత్తలే అవగాహన కల్పించనుండంతో ఈసారి వ్య వసాయం లాభసాటిగా మారే అవకాశాలు ఉన్నాయి.

సాగు పద్ధతులపై అవగాహన.....

రైతులు ప్రతి సారి నకిలీ విత్తనాల బారిన పడ టం, వేసిన పంటలనే మళ్లీ మళ్లీ వేయడం, అధిక దిగుబడులు సాధనకు మోతాదుకు మించి ఎరువు లు వినియోగించడం, ఫలితంగా ఆర్థికంగా నష్టపో తుండటం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతుల నష్టపోకుండా ఉండేందుకు ప్ర భుత్వం వ్యవసాయ శాఖ ద్వారా రైతు చైతన్య కార్య క్రమాన్ని చేపడుతోంది. వానాకాలం సీజన్‌ ఆరంభ సమయంలోనే రైతుల వద్దకే శాస్త్రవేత్తలను పంపిం చి, సమస్యలకు పరిష్కారం చూపించేందుకు కృషి చేస్తోంది. రైతు వేదికల ద్వారా ప్రతి వారం శాస్త్రవే త్తలతో ముచ్చటించే కార్యక్రమాలు కొనసాగించనుం ది. ఇంతకు ముందుకు కూడా అవగాహన కార్యక్ర మాలు ఏర్పాటు చేసినప్పటికీ, దూర భారంతో చాలా వరకు రైతులు అక్కడికి వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో ఆధునిక వ్యవసాయ శాస్త్ర పరిజ్ఞానం అంతంత మాత్రమే అందుతోంది. దీనిని గుర్తించిన వ్యవసాయ శాఖ, రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం పేరిట ఈ నెల 5 నుంచి జూన్‌ 16 వర కు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు ప్రతి గ్రామంలో రైతు వే దికలు లేదా గ్రామ పంచాయతీ కార్యాలయాలలో మొదటి సారిగా ప్రత్యేక అవగాహన సదస్సులు ని ర్వహించేందుకు రంగం సిద్ధం చేసింది.

ఈ ఫార్మర్‌ రిజిస్ట్రి తప్పనిసరి....

జిల్లాలో ఈ నెల 5 నుంచి ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ కూ డా ప్రారంభం కానుంది. ఆధార్‌తో దేశంలోని ప్రతి పౌరునికి గుర్తింపు ఇచ్చినట్లుగానే ప్రతి రైతుకు 11 అంకెలతో కూడిన విశిష్ట సంఖ్యని కేటాయించాలని కేంధ్ర ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయశాఖ రం గాన్ని పూర్తిగా డిజిటలైజేషన్‌ చేయాలనే సంకల్పంతో కేంద్రం ముందుకు సాగుతుండగా, జిల్లాలోనూ ప్రా జెక్టును చేపడుతున్నట్లు వ్యవసాయశాఖ అధికారు లు చెబుతున్నారు. ఇందులో భాగంగా భూమి ఉన్న ప్రతి రైతుకు సంబంధించిన పూర్తి వివరాలతో కూ డిన సమాచారాన్ని ఈ ఫార్మర్‌ రిజిస్ట్రీ కింద నమోదు చేస్తారు. పీఎం కిసాన్‌ లబ్దిదారులకు తరువాత వి డుతలో లబ్ది పొందేందుకు ప్రామాణికంగా ఫార్మర్‌ రిజిస్ర్టిలో నమోదును తప్పనిసరి చేస్తూ కేంద్రం మా ర్గదర్శకాలను జారీ చేసింది. ఇందులో భాగంగా రైతు ఫార్మర్‌ ఐడీ (విశిష్ట సంఖ్య)ని పొందేందుకు ఆధార్‌ కార్డు, భూ యాజమాన్య పాస్‌ పుస్తకం, ఆధార్‌కు లింకు చేయబడిన మొబైల్‌ నెంబర్‌తో సమీపంలోని రైతు వేదికలో వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్ర దిస్తే ఐడీ నెంబర్‌ కేటాయిస్తారు.

రైతులు సద్వినియోగం చేసుకోవాలి....

జిల్లా వ్యవసాయ అధికారి జి కల్పన

వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తల ద్వారా ప్ర భుత్వం ముఖాముఖి అవగాహన సదస్సులు ఏర్పా టు చేస్తున్నందున జిల్లాలోని రైతులంతా సద్వినియో గం చేసుకోవాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవే శపెట్టిన రైతు నమోదు కార్యక్రమాన్ని కూడా ఈ నె ల 5 నుంచే ప్రభుత్వం ప్రారంభిస్తున్నాం. ఇందులో ప్రతి రైతు కేంద్ర ప్రభుత్వం ఆధారిత పథకాల లబ్ది కోసం తన భూమి పట్టా పాస్‌ పుస్తకం, ఆధార్‌ కా ర్డు, అలాగే, ఆధార్‌ కార్డుకు లింకు ఉన్న ఫోన్‌ నెం బర్‌ మీ సేవ కేంద్రాలకుగానీ, లేదా వ్యవసాయ శా ఖ అధికారి వద్ద గానీ భూ వివరాలు నమోదు చే యించుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కూడా పొందటానికి రై తులకు అవకాశం కలుగుతుంది.

Updated Date - May 04 , 2025 | 11:32 PM