ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

kumaram bheem asifabad-సార్వత్రిక సమ్మె విజయవంతం

ABN, Publish Date - Jul 09 , 2025 | 10:57 PM

ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకర ణను ఉపసం హరించుకోవాలని, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర చట్టం చేయాలని, జీవో 49ని రద్దు చేయాలని, పోడు రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన దేశ వ్యాప్త సమ్మె జిల్లాలో విజయవంతమైంది. జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున కార్మికులు కదిలి వచ్చి ర్యాలీ నిర్వహించి స్థానిక అంబేద్కర్‌ చౌక్‌ వద్ద మహాధర్నా చేపట్టారు.

ఆసిఫాబాద్‌లో ర్యాలీ నిర్వహిస్తున్న కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు

ఆసిఫాబాద్‌/కాగజ్‌నగర్‌/రెబ్బన/కెరమెరి/తిర్యాణి/బెజ్జూరు/దహెగాం/కౌటాల/సిర్పూర్‌(టి)/సిర్పూర్‌(యు)/జైనూర్‌/చింతలమానేపల్లి, జూలై 9 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకర ణను ఉపసం హరించుకోవాలని, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర చట్టం చేయాలని, జీవో 49ని రద్దు చేయాలని, పోడు రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన దేశ వ్యాప్త సమ్మె జిల్లాలో విజయవంతమైంది. జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున కార్మికులు కదిలి వచ్చి ర్యాలీ నిర్వహించి స్థానిక అంబేద్కర్‌ చౌక్‌ వద్ద మహాధర్నా చేపట్టారు. సమ్మెలో భాగంగా నిర్వహించిన కార్యక్రమానికి ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దివాకర్‌, ఉపేందర్‌, సీఐటీయూ నాయకుడు రాజేందర్‌లు, శ్రీకాంత్‌ల ఆధ్వర్యంలో కార్మికులు నిరసనకు హాజరయ్యారు. కార్యక్రమంలో నాయకులు, కార్మికులు బాలకిషన్‌, కమలాకర్‌, అశోక్‌, శంకర్‌, చిరంజీవి, సుధాకర్‌, దినకర్‌, మాలశ్రీ, కార్తీక్‌, రాజు, శంకర్‌, దివాకర్‌ తదితరులు పాల్గొన్నారు. కాగజ్‌నగర్‌ పట్టణం, మండలంలో సీఐటీయూ, సీపీఎం, ఐఎన్‌టీయూసీ, టీఎస్‌ యూటీఎఫ్‌, అంగన్‌వాడీ, మున్సిపాల్టీలోని వివిధ సంఘాలతో పాటు ఇతర అనుబంధ సంఘాల నాయకులు, కార్మికులు, సభ్యులు ర్యాలీ నిర్వహించారు. ట్రాన్స్‌ కో కార్యాలయంలో టీజీపీఈ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఆకా కార్యక్రమాల్లో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముంజం శ్రీనివాస్‌, కూశన్న రాజన్న, ఆర్‌.త్రివేణి, ముంజం ఆనంద్‌, జేఏసీ నాయకులు విలాస్‌, ఎమ్మాజీ సతీష్‌, ఇర్ఫాన్‌ అహ్మద్‌, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. రెబ్బెన ఎంపీడీవో కార్యాలయం ఎదుట వివిధ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయా కార్యక్రమాల్లో ఏఐటీయూసీ రెబ్బెన మండల అధ్యక్షులు రాచకొండ రమేశ్‌ రత్నం దేవాజీ, వెంకటేష్‌, శంకర్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో వివిద కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో వైస్‌ ప్రసిడెంట్‌ పేరం శ్రీనివాస్‌, డిప్యూటి జనరల్‌ సెక్రటరి సంగెం ప్రకాష్‌, ఏరియాకార్యదర్శి బూర శ్రీనివాస్‌, గంగు రాంమోహన్‌ పాల్గొన్నారు.కెరమెరి మండల కేంద్రంలో కార్మికులు, ఆయా సంఘా నాయకులు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు ఆనంద్‌రావు, శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు. తిర్యాణిలో కార్మికులు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో నాయకులు టీకానంద్‌, తదితరులు పాల్గొన్నారు. బెజ్జూరు మండల కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. వెంటనే కార్మిక వ్యతిరేక కోర్డులను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. దహెగాం మండల కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో వివిధ శాఖల కార్మికులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాస్తారోకో చేపట్టారు. కార్యక్రమంలో నాయకులు, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఐకేపీ, మధ్యాహ్న బోజన కార్మికులు తదితరులు పాల్గొన్నారు. కౌటాల మండల కేంద్రంలో కార్మికులు, నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో శ్రీనివాస్‌, నగేష్‌, మోరేశ్వర్‌, శారద, జీజాబాయి తదితరులు పాల్గొన్నారు. సిర్పూర్‌(టి) మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేపట్టారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు, అంగన్‌వాడీ, ఆశా, కార్యకర్తలు పాల్గొన్నారు. సిర్పూర్‌(యు) మండల కేంద్రంలో కార్మిక సంఘాల నాయకులు రహదారిపై బైఠా యించారు. కార్యక్రమంలో గోడం సేడ్మరావ గంగారాం తదితరులు పాల్గొన్నారు. జైనూర్‌ మండల కేంద్రంలోని మార్కెట్‌ యార్డులో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు, ఫీల్డ్‌ ఆసిస్టెంట్లు, ఐకేపీ వీవోఏలు, మధ్యాహ్న భోజనం, పంచాయతీ కార్మికులు నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఫీల్డ్‌ ఆసిస్టెంట్ల సంఘం అధ్యక్షుడు ఆత్రం రాజు తదితరులు పాల్గొన్నారు. చింతలమానేపల్లి మండల కేంద్రంలో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. అంతకు ముందు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు విలాస్‌, శ్రీలత, మంగళ, స్వప్న, హంస, రవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 09 , 2025 | 10:57 PM