ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పక్కా భవన నిర్మాణాలకు నిధులు

ABN, Publish Date - Jul 13 , 2025 | 01:03 AM

అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న బీసీ సంక్షేమ వసతిగృహాలు, మహాత్మాజ్యోతిబాపూలే పాఠశాలలకు స్థల సేకరణ చేస్తే భవన నిర్మాణాలకు నిధులు మంజూ రు చేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.

సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌, చిత్రంలో మంత్రి వెంకట్‌రెడ్డి, మండలి చైర్మన గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎంపీ రఘువీర్‌రెడ్డి, కలెక్టర్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు

పక్కా భవన నిర్మాణాలకు నిధులు

మంత్రి పొన్నం ప్రభాకర్‌

నల్లగొండ (కలెక్టరేట్‌), జూలై 12 (ఆంధ్రజ్యోతి): అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న బీసీ సంక్షేమ వసతిగృహాలు, మహాత్మాజ్యోతిబాపూలే పాఠశాలలకు స్థల సేకరణ చేస్తే భవన నిర్మాణాలకు నిధులు మంజూ రు చేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలోని ఉదయాదిత్య భవనలో శనివారం నిర్వహించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా స మీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. అద్దె భ వనాల్లో నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలలు, కళాశాలలు, సంక్షేమ హాస్టళ్ల భవనాల నిర్మాణానికి జి ల్లాల వారీగా స్థల సేకరణ చేసి ప్రతిపాదనలు పం పించాలని కలెక్టర్లను ఆదేశించారు. నల్లగొండ జిల్లా లో 32 బీసీ సంక్షేమ పాఠశాలలు, కళాశాలలు, సం క్షేమ వసతి గృహాలు ఉండగా సుమారు 30అద్దె భ వనాల్లోనే నడుస్తున్నాయని, వీటన్నింటికి పక్కా భ వనాలు నిర్మించేందుకు వెంటనే స్థలాలు చూసి ప్ర తిపాదనలు పంపించాలన్నారు. కులవృత్తులను కా పాడటంలో భాగంగా ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల ఈత చెట్లు, 5లక్షల తాటి చెట్లను నాటడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అలాగే కాటమ య్య రక్షణ కిట్లను ఉమ్మడినల్లగొండ జిల్లాలో వీలైనంత ఎక్కువ మందికి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రహదారి భద్రతలో భాగంగా ఉమ్మడి జిల్లాలో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పే రుందని, వాటిని కొనసాగిస్తూనే అన్ని పాఠశాలలు, కళాశాలల్లో రోడ్డు భద్రత క్లబ్బులను ఏర్పాటు చే యాలన్నారు. మహాలక్ష్మి ప్రారంభించిన తర్వాత ఉ చిత బస్సు సౌకర్యం కింద 195కోట్ల మంది మహిళలు 6500కోట్ల రూపాయల విలువైన ఉచిత ప్ర యాణం చేశారని తెలిపారు. ఆర్టీసీలో 3035 కొత్త ఉద్యోగాలు ఇచ్చామని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో కాలుష్యం తగ్గించేందుకు ఎలకి్ట్రకల్‌ బస్సులను నడుపుతున్నామని, త్వరలోనే 2800 బస్సులు హైదరాబా ద్‌లో తిరిగే ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. జి ల్లాకు 77 ఈవీ బస్సులను మంజూరు చేయగా, శనివారం సుమారు 40బస్సులను ప్రారంభించినట్లు తె లిపారు. నిజాం కాలం నాటి నార్కట్‌పల్లి బస్‌ డిపో ను దత్తత తీసుకొని డిపోకు పూర్వ వైభవం తీసుకొస్తామని, వారం, పది రోజుల్లో రూటింగ్‌ను సెట్‌ చే స్తామని తెలిపారు. రోడ్డు భద్రతలో భాగంగా ట్రా ఫిక్‌ నియమాలను ఉల్లంఘిస్తే శాశ్వతంగా డైవ్రింగ్‌ లైసెన్స రద్దు చేసే నిర్ణయం తీసుకున్నామని, ఆటోమేటెడ్‌ డైవ్రింగ్‌ టెస్టులు చేయనున్నట్లు తెలిపారు. జిల్లా అటవీశాఖ, డీఆర్‌డీవో, బీసీ సంక్షేమ శాఖలు సంయుక్తంగా ప్రభుత్వ స్థలాలను గుర్తించి ఈత, తాటివనాలను పెంచాలని తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ నల్లగొండ, మిర్యాలగూడ, నార్కట్‌పల్లి బస్సులను పెంచాలని, బీసీ సంక్షేమ హాస్టళ్లు, భవనాల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని అన్నారు. శాసనమండలి చైర్మన గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ట్రాఫిక్‌ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేసేలా చూడాలని, ముఖ్యంగా ప్ర జల్లో అవగాహన కల్పించాలని సూచించారు. దండు మల్కాపూర్‌లోని ఫిట్‌నెస్‌ సెంటర్‌ను ఉపయోగంలోకి తీసుకురావాలని అన్నారు.

నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి మా ట్లాడుతూ బీసీ సంక్షేమ హాస్టల్‌, ప్రభుత్వ భవనాలను ఇవ్వాలని, దీనివల్ల అద్దె బాధ తప్పుతుందని అన్నా రు. ఎమ్మెల్యే జైవీర్‌రెడ్డి మాట్లాడుతూ నాగార్జునసాగర్‌ డిగ్రీ కళాశాల భవనం మార్చాలని, బీసీ సంక్షేమ హాస్టల్‌కు మరమ్మతులు చేయించాల ని కోరారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తన నియోజకవర్గంలో పాత రోడ్లలో ని పలు బస్సులను రద్దు చేశారని, వాటిని పునరుద్ధరించాలని అన్నారు. మిర్యాలగూడలోని బీసీ సంక్షే మ హాస్టల్‌ను మార్చాలని కోరారు. నకిరేకల్‌ ఎమ్మె ల్యే వేముల వీరేశం మాట్లాడుతూ నకిరేకల్‌ నియోజకవర్గంలో బస్సులు పెంచాలని అన్నారు. ముంబై, చిట్యాల బస్సును పునరుద్ధరించాలని, కేతేపల్లి మం డలం మూసీ గురుకుల పాఠశాల భవన నిర్మాణా న్ని పూర్తిచేయాలని కోరారు. ఎమ్మెల్సీ శంకర్‌ నాయ క్‌ మాట్లాడుతూ రవాణా, బీసీ సంక్షేమ వసతి గృ హాల విషయంలో జిల్లాకు ప్రాధాన్యమివ్వాలని కోరా రు. కలెక్టర్‌ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ జిల్లాలో ర హదారి భద్రతలో భాగంగా డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని నిర్వహించామని తెలిపారు. మా రుమూల ప్రాంతాలకు ప్రత్యేక రూట్లను ఏర్పాటు చే యనున్నామని, ఈ ఏడాది ఈత ప్లాంటేషనపై ఎ క్కువ దృష్టి కేంద్రీకరిస్తున్నామన్నారు. యాదాద్రి భు వనగిరి జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు మాట్లాడు తూ బస్సుల నిర్వహణ, కాటమయ్య రక్షణ కిట్లు, బీ సీ సంక్షేమ వసతిగృహాలు, గురుకుల పాఠశాలల గురించి వివరించారు. నల్లగొండ ఎస్పీ శరతచంద్ర పవార్‌ రహదారి భద్రతపై తెలియజేయగా, జిల్లా ట్రాన్సపోర్ట్‌ ఉప కమిషనర్‌ వాణి తమ శాఖ ద్వారా చేపట్టే కార్యక్రమాలను తెలియజేశారు. ఈ సమీక్షా సమావేశంలో మిర్యాలగూడ సబ్‌కలెక్టర్‌ నారాయణ అమిత, రవాణా శాఖ కమిషనర్‌ చంద్రశేఖర్‌గౌడ్‌, జిల్లా అటవీశాఖ అధికారి రాజశేఖర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు గీత కార్మికులకు కాటమయ్య రక్షణకిట్లను పంపిణీ చేశారు. అంతకుముందు మంత్రులు, శాసనమండలి చైర్మన, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో వనమహోత్సవం కింద మొక్కలను నాటారు.

అభివృద్ధి పనుల ప్రారంభం

తిప్పర్తి, మాడ్గులపల్లి: నల్లగొండ జిల్లా తిప్పర్తి, మాడ్గులపల్లి మండలాల్లో పలు అభివృద్ధి పనులను మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, కలెక్టర్‌ ఇలా త్రిపాఠితో కలిసి ప్రారంభించారు. తిప్పర్తి కేంద్రంలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం లో నూతనంగా నిర్మించిన అదనపు సమావేశపు హాల్‌ను ప్రారంభించారు. అనంతరం ఆస్పత్రి ఆవరణలో మెక్కలు నాటారు. ప్రజలకు నాణ్యమైన వై ద్యం అందించాలని సూచించారు.

మాడ్గులపల్లి మండల కేంద్రంలో రూ.30లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. మండల కేంద్రంలో రూ.14కోట్లతో సమీకృత భవనాలకు భూమి పూజ చేశారు. ప్రజా ప్రభుత్వంలోనే పేదలకు న్యాయం జరుగుతుందని మంత్రులు అన్నారు. పేదలకు సన్నబియ్యాన్ని పంపిణీ చేసి పేదల పక్షపాతిగా నిలిచామన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘన త కాంగ్రెస్‌ పార్టీకి దక్కుతుందని అన్నారు. ఆయా కార్యక్రమాల్లో సబ్‌ కలెక్టర్‌ నారాయణ్‌అమిత, ఎమ్మె ల్సీ శంకర్‌నాయక్‌, ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, వే ముల వీరేశం, తహసీల్దార్లు పరశురాం, సురే్‌షకుమార్‌, ఎంపీడీవోలు పి.వెంకటేశ్వరెడ్డి, తిరుమలస్వా మి, నాయకులు మాజీ జడ్పీటీసీలు పాశం రాం రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్‌ పాశం సంపతరెడ్డి, పుల్లెంల సైదులు, నాయకులు పురుషోత్తంరెడ్డి, ఏపీఎం చం ద్రశేఖర్‌, శ్యాంసుందర్‌, లింగారావు పాల్గొన్నారు.

ఆయిల్‌ఫాం సాగును 50 వేల ఎకరాలకు పెంచాలి : మంత్రి వెంకట్‌రెడ్డి

నల్లగొండ, జూలై 12(ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లాలో ఆయిల్‌ఫాం సాగును 50వేల ఎకరాలకు పెంచాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టర్‌ ఛాంబర్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వరికి ప్రత్యామ్నాయంగా అధి క ఆదాయం ఇచ్చే ఆయిల్‌ఫాం, ఇతర ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. గంట కు 100 టన్నుల సామర్థ్యం కలిగిన ఆయిల్‌ఫాం ఫ్యాక్టరీని సత్వరమే యుద్ధ ప్రాతిపాదికన నిర్మించి వచ్చే ఆగస్టు మాసంలో ప్రారంభించాలన్నారు. నీటి వసతులు ఉన్న రైతులందరూ ఆయిల్‌ఫాం సాగు చేయాలన్నారు. ప్రభుత్వం ఈ పంటలకు రాయితీతో పాటు మార్కెటింగ్‌ వసతి కల్పిస్తుందని తెలిపారు. సమావేశంలో కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ అధికారి పిన్నపురెడ్డి అనంతరెడ్డి, పతంజలి డీజీఎం యాదగిరి, మధుసూదనరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 13 , 2025 | 01:03 AM