kumaram bheem asifabad- పూర్తి స్థాయి వసతులు కల్పించాలి
ABN, Publish Date - Jul 17 , 2025 | 11:18 PM
రెండు పడక గదుల ఇళ్లల్లో పూర్తి స్థాయి వసతులు కల్పించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. కాగజ్‌నగర్ సబ్‌కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బోరిగాం ఆమ్ర శివారులో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లల్లో పూర్తి స్థాయి వసతులు కల్పించి సిద్ధం చేయాలన్నారు. విద్యుత్, రోడ్లు భవనాల, హౌసింగ్, మిషన్ భగీరథ శాఖల అధికారులు వివిధ రకాల చర్యలు తీసుకోవాలని అన్నారు.
కాగజ్‌నగర్, జూలై 17 (ఆంధ్రజ్యోతి): రెండు పడక గదుల ఇళ్లల్లో పూర్తి స్థాయి వసతులు కల్పించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. కాగజ్‌నగర్ సబ్‌కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బోరిగాం ఆమ్ర శివారులో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లల్లో పూర్తి స్థాయి వసతులు కల్పించి సిద్ధం చేయాలన్నారు. విద్యుత్, రోడ్లు భవనాల, హౌసింగ్, మిషన్ భగీరథ శాఖల అధికారులు వివిధ రకాల చర్యలు తీసుకోవాలని అన్నారు. సబ్ కలెక్టర్ శ్రద్ధాశుక్లా మాట్లాడుతూ బోరిగాం శివారులో 12 బ్లాక్‌లలో 228 రెండు పడక గదులు నిర్మించారని అన్నారు. ఇంకా మిగిలిన ఇళ్లను వెంటనే నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. పనులు త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్‌ఈ శేషరావు, హౌసింగ్ పీడీ వేణుగోపాల్, తహసీల్దార్ మధుకర్ తదితరులు పాల్గొన్నారు.
పిల్లల్లో పోషకాహార లోపాన్ని నియంత్రించాలి
ఆసిఫాబాద్, జూలై 17 (ఆంధ్రజ్యోతి): పిల్లల్లో పోషక ఆహార లోపం తలెత్తకుండా చూడాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలోని కలెక్టర్‌చాంబర్‌లో గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, యూనిసెఫ్ ప్రతినిధులతో జిల్లాలో పోషక ఆహార లోపం కలిగిన పిల్లల నిష్పత్తిని తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని పిల్లలో పోషక ఆహారం లోపం కలిగిన వారిని గుర్తించేం దుకు క్షేత్రస్తాయిలో వైద్య ఆరోగ్య శాఖ, శిశు సంక్షేమ శాఖల అఽధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించాలన్నారు. పోషక ఆహారం లోపం గల వారిని గుర్తించాలని, వారికి సకాలంలో పోషక ఆహారం, అవసరమైన మందులు అందించి పోషకాహారాలు లోపాన్ని అదిగమించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పోషకాహార లోపం నిష్పత్తిని తగ్గించేందుకు చిన్న పిల్లలకు సరైన సమయంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అం దించాలని తెలిపారు. జిల్లాలో పోషకాహార సంబంధిత ప్రయత్నాలకు యూనిసెఫ్ బృందం వారి సహకరంతో క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు సేకరించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సీతారాం, యూనిసెఫ్ పోషకాహార నిపుణురాలు డాక్టర్ ఖ్యాతితివారి, న్యూట్రిషన్ ఆఫీసర్ రేష, బృందం సభ్యులు పాల్గొన్నారు.
Updated Date - Jul 17 , 2025 | 11:18 PM