ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Cooking Oils: ‘గో ఫర్‌ ఫ్రీడమ్‌ గోల్డ్‌ ఆఫర్‌-2024’ బంపర్‌ డ్రా

ABN, Publish Date - Jan 31 , 2025 | 04:25 AM

ప్రముఖ వంట నూనెల బ్రాండ్‌ ఫ్రీడమ్‌ హెల్తీ కుకింగ్‌ ఆయిల్స్‌.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ‘గో ఫర్‌ ఫ్రీడమ్‌ గోల్డ్‌ ఆఫర్‌’ బంపర్‌ డ్రా విజేతలను ప్రకటించింది.

  • విజేతల్లో ఒక్కో రాష్ట్రం నుంచి ఒక్కొక్కరికి 50 గ్రాములు

  • ఇద్దరికి 10 గ్రాముల బంగారు నాణేల అందజేత

హైదరాబాద్‌, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ వంట నూనెల బ్రాండ్‌ ఫ్రీడమ్‌ హెల్తీ కుకింగ్‌ ఆయిల్స్‌.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ‘గో ఫర్‌ ఫ్రీడమ్‌ గోల్డ్‌ ఆఫర్‌’ బంపర్‌ డ్రా విజేతలను ప్రకటించింది. ఒక్కో రాష్ట్రం నుంచి ఒక్కో విజేతకు 50 గ్రాముల బంగారు నాణెం, ఒక్కో రాష్ట్రంలో ఇద్దరు విజేతలకు 10 గ్రాముల బంగారు నాణేలకు ఎంపిక చేశారు. ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి న్యాయనిర్ణేతగా వ్యవహరించి విజేతలకు బంగారు నాణేలు అందించారు. పండగ సీజన్‌లో వినియోగదారులకు చేరువయ్యేందుకు ‘గో ఫర్‌ ఫ్రీడమ్‌ గోల్డ్‌ ఆఫర్‌-2024’’ ప్రమోషన్‌ స్కీమ్‌ ప్రారంభించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, ఒడిషా, ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రాల్లో ఈ స్కీమ్‌ను అమలు చేశారు.


ఈ ప్రాంతాల్లోని 100 మంది వినియోగదారులు రోజుకు 1 గ్రాము బంగారం గెలుచుకోవడంతోపాటు బంపర్‌ డ్రాలో పాల్గొనే అవకాశం పొందారు. ఐదు రాష్ట్రాల నుంచి ఐదుగురు (ఒక్కో రాష్ట్రం నుంచి ఒకరు) 50 గ్రాముల బంగారు నాణెంను, 10 మంది (ఒక్కో రాష్ట్రం నుంచి ఇద్దరు) 10 గ్రాముల బంగారు నాణెం అందుకుంటున్నారు. ప్రత్యేక ప్రమోషనల్‌ కార్యక్రమాలతో వినియోగదారులకు ఆనందం కలిగించే ప్రయత్నాలు చేస్తుంటామని జెమిని ఎడిబుల్స్‌ అండ్‌ ఫ్యాట్స్‌ ఇండియా లిమిటెడ్‌ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పి.చంద్రశేఖర రెడ్డి తెలిపారు.

Updated Date - Jan 31 , 2025 | 04:25 AM