ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Government: నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ప్రతి నెలా రూ.1500 రావాలంటే..

ABN, Publish Date - Jan 27 , 2025 | 09:09 AM

ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతీ యువకులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.ఈ గడువులోగా దరఖాస్తు చేసుకున్నవారికి ప్రతి నెలా రూ.1500 బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని ప్రకటించింది..

TGBC Free coaching Program

నిరుద్యోగ యువతీ యువకులకు ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. ఏదైనా ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులై ఉంటే చాలు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని TGBC స్టడీ సర్కిల్‌లలో నిరుద్యోగులకు ఉచిత ఫౌండేషన్ కోర్సు అందించనుంది. దీంతో పాటు తెలంగాణ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ స్టడీ బోర్డ్ (TGBC) విడుదల చేసిన ప్రకటన ప్రకారం ప్రతి నెలా రూ.1500 బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. అయితే, ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం గడువులోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో దరఖాస్తు చేసుకున్నవారికి అర్హతలను బట్టి సివిల్స్ సహా బ్యాంకు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రభుత్వమే ఉచిత కోచింగ్ అందిస్తుంది.


తెలంగాణ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ స్టడీ బోర్డ్ (TGBC) నిరుద్యోగ యువత కోసం ఒక గోల్డెన్ ఆఫర్ ప్రకటించింది. డిగ్రీ పాసై ఏదైనా ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్న యువతీ యువకులు ఇందుకు అర్హులు. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం గడువులోగా దరఖాస్తు చేసుకున్నవారికి TGBC ఎంప్లాయ్‌మెంట్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ఉచిత కోచింగ్ అందిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని TGBC స్టడీ సర్కిల్‌లలో RRB, SSC, వివిధ బ్యాంకింగ్ పరీక్షల కోసం సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఫౌండేషన్ కోర్సు ట్రైనింగ్ ఇస్తారు. ఈ ఉచిత కోచింగ్ ప్రోగ్రామ్ ఫిబ్రవరి 15 నుంచి రాష్ట్రంలోని అన్ని TGBC స్టడీ సర్కిల్‌లలో ప్రారంభమవుతుంది. సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు కూడా ఉచిత కోచింగ్ సేవలను ప్రారంభించింది తెలంగాణ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ స్టడీ బోర్డ్ (TGBC).


ఎక్కడ దరఖాస్తు చేయాలి..

అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 9 లోగా RRB, SSC మరియు వివిధ బ్యాంకింగ్ పరీక్షల ఉచిత కోచింగ్ కోసం అధికారిక వెబ్‌సైట్ (https://www.tgbcstudycircle.cgg.gov.in)లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.


అర్హత ప్రమాణాలు ఏమిటి

అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, గ్రామీణ ప్రాంతాల్లోని అభ్యర్థుల తల్లిదండ్రుల ఆదాయం సంవత్సరానికి రూ. 1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో అభ్యర్థుల కుటుంబ ఆదాయం రూ. 2 లక్షలకు మించకూడదు. అభ్యర్థుల ఎంపిక విధానం ఇంటర్మీడియట్ , డిగ్రీ పరీక్షలలో పొందిన మార్కులు ఆధారంగా ఉంటుంది. రిజర్వేషన్ నిబంధనల ప్రకారం బీసీ-ఏ 18%, బిసి-బి 26%, బిసి-సి 03%, బీసీ-డీ 18%, ఎస్సీ 15%, ఎస్టీ 5%, ఇతరులు 05% లకు కేటాయిస్తారు. అర్హత సాధించిన అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫిబ్రవరి 12 నుండి 14 వరకు ఉంటుంది.


అభ్యర్థుల కోసం హెల్ప్‌లైన్

మరింత సమాచారం కోసం ఆసక్తి గల అభ్యర్థులు TGBC జారీ చేసిన హెల్ప్‌లైన్ నంబర్ 040-24071178 లేదా సంప్రదించవచ్చు. సివిల్ సర్వీసెస్ కోసం కూడా ఉచిత కోచింగ్ అందుబాటులో ఉంది.


TGBC స్టడీ సర్కిల్ కోర్సుకు ఎంపికైన వారికి 100 రోజుల పాటు శిక్షణ ఉంటుంది. నిపుణులైన ఆధ్యాపక బృందం ప్రతిరోజు నాలుగు క్లాసులు బోధిస్తారు. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, అరిథమెటిక్, మ్యాథమేటిక్స్, ప్యూర్ మ్యాథ్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్, జనరల్ ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్, జీకే సబ్జెక్టులపై పూర్తిస్థాయిలో అవగాహన వచ్చేలా శిక్షణ ఇస్తారు. ప్రతిరోజు, వారానికి ఒకసారి పరీక్షలు ఉంటాయి. అలాగే ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ జాగ్రఫీ, జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కంప్యూటర్ అవేర్‌నెస్, బ్యాంకింగ్ గవర్నెన్స్ పై అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం బోధిస్తుంది. ఎంపికైన అభ్యర్థులకు 75% అటెండెన్స్ తప్పక ఉండాలి. అప్పుడే ప్రతినెల రూ.1500 స్టైఫండ్ అండ్ బుక్ ఫండ్, ట్రాన్స్‌పోర్టేషన్ ఖర్చులు లభిస్తాయి.

Updated Date - Jan 27 , 2025 | 09:09 AM