ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రపంచానికి సవాల్‌గా ఉగ్రవాదం

ABN, Publish Date - Jan 28 , 2025 | 03:40 AM

ఉగ్రవాదం ప్రపంచ దేశాలకు పెను సవాల్‌గా మారిందని అలహాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ మాజీ వైస్‌ చాన్స్‌లర్‌(వీసీ) రాజెన్‌ హర్షే అన్నారు. అన్ని రాష్ట్రాలు, దేశాలు సమన్వయంతో పని చేస్తేనే ఉగ్రవాదాన్ని అంతం చేయడం సాధ్యమవుతుందని చెప్పారు.

  • అలహాబాద్‌ సెంట్రల్‌ వర్సిటీ మాజీ వీసీ హర్షే

  • పోలీసింగ్‌లో వ్యాస్‌ది ప్రత్యేక ముద్ర: డీజీపీ జితేందర్‌

హైదరాబాద్‌, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): ఉగ్రవాదం ప్రపంచ దేశాలకు పెను సవాల్‌గా మారిందని అలహాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ మాజీ వైస్‌ చాన్స్‌లర్‌(వీసీ) రాజెన్‌ హర్షే అన్నారు. అన్ని రాష్ట్రాలు, దేశాలు సమన్వయంతో పని చేస్తేనే ఉగ్రవాదాన్ని అంతం చేయడం సాధ్యమవుతుందని చెప్పారు. మాజీ ఐపీఎస్‌ అధికారి కేఎస్‌ వ్యాస్‌ 26వ స్మారక ఉపన్యాసం బంజారాహిల్స్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ‘ప్రపంచీకరణ-ఉగ్రవాదం’ అనే అంశంపై హర్షే మాట్లాడారు. 9/11 దాడుల తర్వాత ప్రపంచ దేశాలు ఉగ్రవాదాన్ని అంతర్జాతీయ సమస్యగా గుర్తించాయని చెప్పారు.


పోలీసింగ్‌లో మార్పు కోసం వ్యాస్‌ ఎన్నో సంస్కరణలు చేపట్టారని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు వ్యవస్థలో కేఎస్‌ వ్యాస్‌ పలు సంస్కరణలు చేశారని, అవి ఇప్పటికీ సమర్థంగా కొనసాగుతున్నాయని డీజీపీ జితేందర్‌ అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, శాంతి భద్రతల పరిరక్షణకు కొత్తగా పోలీస్‌ కమిషనరేట్ల ఏర్పాటు, మావోయిస్టుల కట్టడికి గ్రేహౌండ్స్‌ విభాగం ఏర్పాటులో వ్యాస్‌ కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు.

Updated Date - Jan 28 , 2025 | 03:40 AM