మాజీ ఎమ్మెల్సీ, జర్నలిస్టు సత్యనారాయణ ఇక లేరు
ABN, Publish Date - Jan 27 , 2025 | 04:59 AM
తెలంగాణ రాష్ట్ర సాధనకు కృషి చేసిన మాజీ ఎమ్మెల్సీ, జర్నలిస్ట్ ఆర్.సత్యనారాయణ అనారోగ్యంతో సంగారెడ్డిలోని ఆయన నివాసంలో ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు.
నివాళులర్పించిన పలువురు బీఆర్‌ఎస్ నేతలు
సంగారెడ్డి క్రైం, జనవరి26(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర సాధనకు కృషి చేసిన మాజీ ఎమ్మెల్సీ, జర్నలిస్ట్ ఆర్.సత్యనారాయణ అనారోగ్యంతో సంగారెడ్డిలోని ఆయన నివాసంలో ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ప్రజాహిత కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించిన సత్యనారాయణ మృతి బాధాకరమని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ తదితరులు కూడా సంతాపం తెలిపారు.
మరోవైపు సత్యనారాయణ భౌతికకాయానికి సంగారెడ్డిలో మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్.సత్యనారాయణ 1985లో జర్నలిస్టుగా తన ప్రస్థానం ప్రారంభించారు. ఈనాడు, ఉదయం, వార్త దినపత్రికల్లో జిల్లా రిపోర్టర్‌గా పనిచేశారు. మంజీరా, సలామ్ హైదరాబాద్ అనే పత్రికలను సొంతంగా నిర్వహించారు. 2001లో టీఆర్‌ఎ్‌సలో చేరారు. 2007లో కరీంనగర్ పట్టభద్రుల స్థానం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలుపొందారు.
Updated Date - Jan 27 , 2025 | 04:59 AM