వరుణుడి కరుణ కోసం..
ABN, Publish Date - Jun 30 , 2025 | 12:50 AM
ఈ ఏడాది ముందస్తుగా తొలకరి మురిపించడంతో సంవృద్దిగా వర్షాలు కురుస్తాయని ఆనందంతో రైతులు సాగుకు సన్నద్ధమయ్యారు. మెట్ట ప్రాంతాల్లో పత్తి సాగు చేయగా, ఆయకట్టు రైతు లు బోరుబావులు, చెరువుల ఆధారంగా నీరు, నారు తయారు చేసుకోవడంలో తలమునకలయ్యారు.
వరుణుడి కరుణ కోసం..
చినుకురాలక అన్నదాతల్లో ఆందోళన
ఎండుతున్న నారుమళ్లు, పత్తి పంట
వేడిగాలుల దాటికి దెబ్బతింటున్న మొలకలు
ప్రతికూల పరిస్థితుల్లో రైతాంగం
ఈ ఏడాది ముందస్తుగా తొలకరి మురిపించడంతో సంవృద్దిగా వర్షాలు కురుస్తాయని ఆనందంతో రైతులు సాగుకు సన్నద్ధమయ్యారు. మెట్ట ప్రాంతాల్లో పత్తి సాగు చేయగా, ఆయకట్టు రైతు లు బోరుబావులు, చెరువుల ఆధారంగా నీరు, నారు తయారు చేసుకోవడంలో తలమునకలయ్యారు. జూలై రెండోవారంలో వరినాట్లు మొదలుపెట్టేందుకు వీలుగా నారుమళ్లు సిద్ధం చేశారు. అయితే వారం రోజులుగా ప్రతికూల వాతావరణం ఎండాకాలన్ని తలపిస్తోంది. రైతులు వరుణుడి కరుణ కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు వానాకాలం సీజనలో మెట్టపంటగా సాగైన పత్తి గింజలు మొలకెత్తే దశలో భూమిలోనే మాడిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- (ఆంధ్రజ్యోతి-మిర్యాలగూడ అర్బన, దేవరకొండ)
నాగార్జునసాగర్ ఆయకట్టు ప్రాంతాల్లోని మిర్యాలగూడ, వేములపల్లి, త్రిపురారం మండలాల పరిధిలోని రైతులు బోరుబావులు, చెరువు నీటి ఆధారంగా వరి నారుమడిని సిద్ధం చేసుకున్నారు. మరోవైపు శ్రీశైలం జలాశయం వైపు కదిలొస్తున్న కృష్ణమ్మను చూసి రైతాంగంలో ఆశలు మొలకెత్తాయి. ప్రాజెక్టులు నిండి సాగునీటి విడుదల చేస్తారన్న ఆశతో రైతులు ఉన్నారు. అయితే వారం రోజులుగా చినుకు రాలకపోవడతో వాతావరణం చల్లబడడం లేదు. ఎండతీవ్రతతో పాటు వీస్తున్న వేడిగాలుల ధాటికి వరి గింజ మొక్క తట్టుకోలేక వాడుతోంది. గతంలో కంటే భిన్నమైన వాతావరణ పరిస్థితులు తలెత్తి సాగు పనులు ముందుకు సాగడం లేదంటూ రైతులు చెబుతున్నారు. కూలీల కొరతను అధిగమించాలంటే జూలై నెలాఖరులోనే నారుమళ్లు సిద్ధం చేసుకోవాలని రైతులు భావిస్తున్నా ప్రస్తుత పరిస్థితులు అనుకూలించ రైతులు ఉక్కిబిక్కిరవుతున్నారు.
రైతులపై విత్తనభారం
కార్తెల బలాన్ని గుర్తించి రైతులు పంటసాగు పనులు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఆరుద్ర కార్తె తొలిదశలో రైతులు వరిసాగు పనులు షురూ చేశారు. విత్తనాలు సేకరించి నారుమళ్లను సిద్ధం చేసుకున్నారు. అయితే తయారైన నారుమళ్లను వేడిగాలులు దెబ్బతీయడంతో రైతాంగంపై విత్తనభారం పడుతోంది. కొ న్నేళ్లుగా సన్నరకం విత్తనాలు రైతులు ఎంచుకుంటున్నారు. ఈ సీజనలో అత్యధికంగా 101, చిట్టిపొట్టి, మహీంద్ర 505, పూజ తదితర ప్రైవే టు కంపెనీల విత్తనాలకు ప్రాధాన్యమిచ్చారు. బహిరంగ మార్కెట్లో 10కిలోల విత్తనాలను రూ. 1200లకు డీలర్లు విక్రయిస్తున్నారు. ఎకరాకు 15 కిలోల చొప్పున వరి విత్తనాలు సేకరించి తయా రు చేసుకున్న నారుమళ్లు ప్రతికూల వాతారణ పరిస్థితిని తట్టుకోలేక చనిపోతున్నా యి. దీంతో మళ్లీ విత్తనాలు సేకరించి నారుమడిని తయారు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యం లో రైతాంగానికి ఆదిలోనే కష్టాలు వచ్చినట్లు విత్తనాల పెట్టుబడి భారాన్ని భ రించాల్సి వస్తోంది. దీంతో చిన్న, సన్నకారు రైతులకు పలు రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది.
వాడుతున్న పత్తి పంట
వర్షాలు కురవకపోవడంతో మెట్ట పంటగా సాగు చేసిన పత్తి పంట ఎండుతోంది. దీంతో పత్తి సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. దేవరకొండ డివిజన పరిధిలోని అన్ని మండలాల్లో 1.40 వేల ఎకరాల్లో పత్తి సాగు చే శారు. విత్తనాలు మొలకలు వస్తున్నా వరుణుడు ముఖం చాటేయడంతో మొలకలు ఎండుదశకు చేరుతున్నాయి. నీటి వనరులు ఉన్న రైతులు స్పింకర్లతో పత్తి పంటను కాపాడుకుంటున్నారు. దేవరకొండ డివిజనలో అత్యధికంగా పత్తిసాగుపైనే రైతులు మొగ్గు చూపుతున్నారు. ఎకరానికి రూ.10వేలకుపైగా పెట్టుబడులు పెట్టి రైతులు విత్తనాలు వేశారు. పరిస్థితి ఇలాగే ఉంటే వేసిన విత్తనాలు ఎండిపోయి మళ్లీ రెండోసారి విత్తనాలు వేయాల్సి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎనిమిది ఎకరాల నారు చనిపోయింది
మండెకట్టిన మూడు రోజులకు వరిగింజ మొ లక బాగానే వచ్చింది. నీరునారు పెంచేందుకు నారుమడిలో మొలకలు వే శా. మొక్కదశకు చేరుతున్న క్రమంలో వేడిగాలుల ధాటికి ఎనిమిది ఎకరాల నారు వాడుపట్టి చనిపోయింది. సుమారు రూ.14 వేల పెట్టుబడితో సాగుచేసిన నారు ఆదిలోనే చనిపోయింది. విధిలేని పరిస్థితిలో మళ్లీ విత్తనాలు కొనుగోలుచేసి నారుపోయాల్సి వచ్చింది.
- నారాయణ శేఖర్‌రెడ్డి, రైతు, వేములపల్లి
నారుమడిలో తేమ ఉండేలా చూసుకోవాలి
నీటి వనరుల ఆధారంగా తయారు చేసుకున్న నారుమడిలో తేమశాతం ఉండేలా చూసుకోవాలి. ఉదయం, సాయంత్రం వే ళలో నీరుపెట్టి బయటకు తీయడంతో మొలకలు దెబ్బతినే అవకాశం ఉండదు. వరినారు తొలిఆకు వచ్చేంత వరకు రైతులు జాగ్రత్తపడాలి. జూలై 10 వరకు వానాకాలం నారు తయారు చేసుకోవచ్చు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సాగుపనులు చేపట్టాలి.
- డి. సైదానాయక్, ఇనచార్జి, ఏడీఏ, మిర్యాలగూడ
Updated Date - Jun 30 , 2025 | 12:50 AM