ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రేషనకార్డులకు దరఖాస్తుల వెల్లువ

ABN, Publish Date - Jul 14 , 2025 | 12:56 AM

రేషనకార్డుల కోసం పదేళ్లుగా నిరీక్షిస్తున్న లబ్ధిదారుల కు ఊరట లభించింది. ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులందరికీ రేషనకార్డులు ఇచ్చే ప్రక్రియను మొదలు పెట్టడంతో దరఖాస్తు చేసేందుకు మీ సేవ కేంద్రాలకు అర్హులు క్యూ కడుతున్నారు.

శాలిగౌరారం మీ సేవలో రేషన కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటున్న లబ్ధిదారులు

రేషనకార్డులకు దరఖాస్తుల వెల్లువ

మీసేవ కేంద్రాలకు పరుగులు

కార్డుల కోసం పదేళ్లుగా నిరీక్షణ

శాలిగౌరారం, జూలై 13(ఆంధ్రజ్యోతి): రేషనకార్డుల కోసం పదేళ్లుగా నిరీక్షిస్తున్న లబ్ధిదారుల కు ఊరట లభించింది. ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులందరికీ రేషనకార్డులు ఇచ్చే ప్రక్రియను మొదలు పెట్టడంతో దరఖాస్తు చేసేందుకు మీ సేవ కేంద్రాలకు అర్హులు క్యూ కడుతున్నారు. దీంతో మీ సేవా కేంద్రాలు, తహసీల్దార్‌ కార్యాలయానికి బారులు కడుతున్నారు. గత జనవరి నెలలో జరిగిన కులగణన సర్వేలో లబ్ధిదారుల ను గుర్తించి జాబితాలను గ్రామ సభల్లో ప్రదర్శించారు. ఇందులో చాలామంది పేర్లు లేపోవడంతో మళ్లీ అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. అయితే తాజాగా మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తుల స్వీకరణకు పౌరసరఫరాల శాఖ అవకాశం కల్పించింది. దీంతో జిల్లా వ్యా ప్తంగా ఉన్న మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తుదారు ల హడావుడి ఏర్పడింది. గతంలో శాలిగౌరారం మండలంలో 13,915 రేషన కార్డులు ఉన్నాయి. ఇటీవల మీసేవలో 1725 మంది దరఖాస్తులు చేసుకోగా, రెవెన్యూ అధికారులు అసలైన లబ్ధిదారులను గుర్తించి 1506 కార్డులు జారీ చేశారు. రేషనకార్డుల్లో తమ పిల్లల పేర్లు లేకపోవడంతో పాటు వివాహాలు జరిగి కొత్తగా ఇళ్లకు వచ్చిన కోడళ్ల పేర్లు చేర్పులకోసం ఇన్ని రోజులు ఆరా టపడినవారికి కూడా కుటుంబ సభ్యులలో చేర్పుల, మార్పుల కోసం అవకాశం కల్పించారు. మార్పులు, చేర్పుల కోసం 2420 మంది చేసుకో గా 2307 మందికి కార్డులు వచ్చాయి. ఇంకా ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నెల 14న తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో ముఖ్యమంత్రి రేవంతరెడ్డి చేతుల మీదుగా నూతన రేషన కార్డుల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రేషనకార్డుల దరఖాస్తు నిరంతర ప్రక్రియ

రేషనకార్డుల ప్రక్రియ నిరంతర కొనసాగుతుంది. కార్డు లు రాలేదని ఎవరూ ఆందోళ న చెందవద్దు. అర్హులైన వారు మీ సేవలో దరఖాస్తు చేసుకుంటే పరిశీలించిన వెంటనే ఇస్తాం. నిబంధనలకు అనుగుణంగా నూతన రేషన కార్డుల ప్రక్రియ ఉంటుందని, కుటుంబ సభ్యుల చేర్పులు, మార్పులు కూడా చేస్తామన్నారు. ఎక్కడైతే ఆధార్‌ కార్డు ఉంటుందో ఆ చిరునామా ప్రకారమే రేషనకార్డు ఇస్తాం.

షేక్‌ జహీరుద్దీన,తహసీల్దార్‌, శాలిగౌరారం

పదేళ్ల నిరీక్షణ నెరవేరింది

రేషనకార్డులో మా కుటుంబ సభ్యుల పేర్లను చేర్చడం కోసం పదేళ్ల నుంచి ఎదురుచూస్తున్నాం. ప్రభుత్వం నూతనంగా అర్హులైన వారికి రేషనకార్డుల కోసం, చేర్పుల, మార్పుల కోసం అవకాశం కల్పించింది. దీంతో నేను వెంటనే మా కుటుంబ సభ్యుల పేర్లను మీ సేవలో దరఖాస్తు చేయగా అధికారుల పరిశీలించి మా కుటుంబ సభ్యుల పేర్లను చేర్చారు. నాకు ఎంతో ఆనందంగా ఉంది.

వీరేంకుల మహేష్‌, రేషనకార్డు లబ్ధిదారుడు, మనిమిద్దె, శాలిగౌరారం

Updated Date - Jul 14 , 2025 | 12:56 AM