గోకుల్ బేకరీలో అగ్ని ప్రమాదం
ABN, Publish Date - Jun 19 , 2025 | 12:21 AM
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని గోకుల్ బేకరీ అండ్ స్వీట్స్ దుకాణంలో బుధవారం అగ్ని ప్రమాదం జరిగింది.
పూర్తిగా దగ్ధమైన షాపు
రూ. 4.50 లక్షల ఆస్తినష్టం
మిర్యాలగూడ పట్టణంలో ఘటన
మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది
మిర్యాలగూడ అర్బన్, జూన్ 18(ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని గోకుల్ బేకరీ అండ్ స్వీట్స్ దుకాణంలో బుధవారం అగ్ని ప్రమాదం జరిగింది. బాధితుడు రాహుల్ అగర్వాల్ తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని రాజీవ్‌చౌక్ వద్ద గల బేకరి షాపులో విక్రయాలు సాగిస్తున్న క్రమంలో సామాగ్రి నిల్వ ఉంచిన షాపు పై ఆంతస్తులో షార్ట్‌సర్క్యూట్‌తో దుకాణంలో మంటలు వ్యాపించాయి. కొద్ది నిమిషాల వ్యవధిలోనే అగ్ని కీలలు ఎగసిపడడమేగాక, దట్టమైన పొగ వ్యాపించడంతో ఏమి జరుగుతుందోనన్న షాపులోని వినియోగదారులు, స్థానికులు భయాందోళనతో పరుగులు పెట్టారు. వెంటనే అగ్ని మాపక సిబ్బందికి సమారమిచ్చారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది దుకాణంలో వ్యాపిస్తున్న మంటలను అదుపు చేసేందుకు శ్రమించారు. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి చాకచక్యంగా మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. షార్ట్‌సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లు గుర్తించామని ఫైర్ ఆఫీసర్ యాదగిరి తెలిపారు. ఈ ప్రమాదంలో బేకరి సమాగ్రితోపాటు ఏసీ పూర్తిగా దగ్ధమైనట్లు గుర్తించామన్నారు. కాగా అగ్ని ప్రమాదంతో సుమారు రూ. 4.50 లక్షల అస్తి నష్టం వాటిల్లిందని బాధితుడు రాహుల్ అగర్వాల్ ఆవేదన వ్యక్తం చేశాడు.
Updated Date - Jun 19 , 2025 | 12:21 AM