కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం
ABN, Publish Date - May 20 , 2025 | 11:32 PM
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవ లంబిస్తున్న విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలి ఏఐటీయూసీ జి ల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు, ఇఫ్టూ జిల్లా అధ్యక్షులు బ్రహ్మా నందం అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహ నం చేశారు.
మంచిర్యాలకలెక్టర్, మే20(ఆంధ్రజ్యోతి): కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవ లంబిస్తున్న విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలి ఏఐటీయూసీ జి ల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు, ఇఫ్టూ జిల్లా అధ్యక్షులు బ్రహ్మా నందం అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహ నం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో సంపద సృష్టిం చేది కార్మికులేనని, సహజ వనరులను వెలికి తీసి సంపదగా మార్చే కార్మిక వర్గ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు తప్పనిసరిగా కృషి చేయాలన్నా రు. అలాంటి సంపద సృస్టించే కార్మికుల హక్కులను హరించే ప్రభుత్వాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. 44 కార్మిక చట్టాలను 4కోడ్‌లుగా మార్చి కార్మికవర్గానికి హక్కులు లేకుండా కేవలం కార్పొరేట్ వ్యాపార సం స్థలకే లాభం చేకూర్చడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. దేశ వ్యాప్త సార్వ త్రిక సమ్మె జులై 9న విజయవంతం చేయాలని కార్మికవర్గాన్ని కోరారు. ప్ర భుత్వరంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చే విధానాలను కేంద్ర ప్రభు త్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీ యు జిల్లా నాయకులు ప్రకాశ్, పీయుసీఐ నాయకులు దేవరాజ్, ఏఐటీయు సీ నాయకులు కలీందర్ అలీఖాన్, మిట్టపల్లి పౌలు, రవీందర్, శ్రీనివాస్, రాములు, ప్రభాకర్, రాజేందర్; పోచమల్లు పాల్గొన్నారు.
Updated Date - May 20 , 2025 | 11:32 PM