పోచంపల్లిలో ఫ్యాషన్ విద్యార్థుల సందడి
ABN, Publish Date - Jun 05 , 2025 | 12:10 AM
: హైదరాబాద్‌లోని రూట్స్ కాలేజీ ఆఫ్ ఫ్యాషన్ అండ్ ఇంటీరియల్ కాలేజీకి చెందిన 30 మంది ఫ్యాషన్ విద్యార్థులు క్షేత్ర పర్యటనలో భాగంగా బుధవారం భూదాన్‌పోచంపల్లి సందర్శించారు.
భూదాన్‌పోచంపల్లి, జూన్ 4 (ఆంధ్రజ్యోతి) : హైదరాబాద్‌లోని రూట్స్ కాలేజీ ఆఫ్ ఫ్యాషన్ అండ్ ఇంటీరియల్ కాలేజీకి చెందిన 30 మంది ఫ్యాషన్ విద్యార్థులు క్షేత్ర పర్యటనలో భాగంగా బుధవారం భూదాన్‌పోచంపల్లి సందర్శించారు. ఈ సందర్భంగా పట్టణంలోని రూరల్ టూరిజం పార్కులోని చేనేత మ్యూజియంతోపాటు చేనేత కళా నైపుణ్యాన్ని పరిశీలించారు. అనంతరం చేనేత కార్మికుల గృహాలను సందర్శించి చేనేత ప్రక్రియను పరిశీలన చేశారు. ఈ సందర్భంగా కాలేజీ చైర్మన్ హబీబ్ పడాల మాట్లాడుతూ చేనేత రంగానికి సంబంధించిన స్టడీ టూర్‌లో భాగంగా పోచంపల్లిని సందర్శించామని తెలిపారు. ఇక్కడి కార్మికుల రూపొందిస్తున్న చేనేత వస్త్ర కళానైపుణ్యం అద్భుతంగా ఉందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ఫ్యాకల్టీ మోహన్‌శ్రీ, కావ్య, అంకిత, ఉష తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 05 , 2025 | 12:10 AM