ఆసక్తి కనబరుస్తున్న రైతులు
ABN, Publish Date - Jul 02 , 2025 | 11:28 PM
ప్రభు త్వ ప్రోత్సాహంతో ఆయిల్ పామ్ సాగు చేయ డానికి రైతుల ఆసక్తి కనబరుస్తున్నారని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు.
- ఆయిల్ పామ్ సాగుపై కలెక్టర్ బదావత్ సంతోష్
ఊర్కొండ , జూలై 2 (ఆంధ్రజ్యోతి) : ప్రభు త్వ ప్రోత్సాహంతో ఆయిల్ పామ్ సాగు చేయ డానికి రైతుల ఆసక్తి కనబరుస్తున్నారని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. బుధవారం మండ లంలోని మాధారం గ్రామానికి చేరుకొని రైతు పొలానికి ట్రాక్టర్‌పై వచ్చిన కలెక్టర్‌కు అధికారు లు, రైతులు పుప్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. అనంతరం జిల్లా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రైతు శ్రీకాంత్‌కు చెందిన 10 ఎకరాల పొలంలో 500 ఆయిల్ పామ్ మొక్కలు నాటే కార్యక్రమం లో పాల్గొన్నారు. అదేవిధంగా మరో రైతు కృష్ణారెడ్డి ఆయిల్ పామ్ మొదటి క్రాప్ కట్టింగ్ ప్రా రంభించారు. ఈ సంద ర్భంగా రైతులకు అవగా హన కల్పించేందుకు ఏర్పా టు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఈ జిల్లా ఆయిల్ పామ్ తోటల సాగుకు అనుకూలంగా ఉందని తెలిపారు. ఆయిల్‌పామ్ పరిశోధన కేం ద్రం శాస్త్రవేత్తలు కూడా దిగుబడి బాగుంటుం దని, గతంలోనే జిల్లాను సందర్శించి ధ్రువీకరిం చారని అన్నారు. ప్రస్తుతం రైతు పొలంలో నాటి న ఆయిల్ పామ్ గెలలు, రానున్న నాల్గవ సంవత్సరం నుంచి 30 ఏళ్ల వరకు దిగుబడి వస్తుందన్నారు. జిల్లాలో ఇప్పటికే 7వేల ఎకరా ల్లో పామ్ పంట సాగు జరిగిందని తెలిపారు.
Updated Date - Jul 02 , 2025 | 11:28 PM