రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగొద్దు
ABN, Publish Date - May 08 , 2025 | 11:29 PM
కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఎలాం టి అసౌకర్యం కలుగకుండా చూడాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురు వారం లక్షెట్టిపేట మండలంలోని పలు గ్రామాల్లో రైతుల సౌకర్యార్థం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు.
కలెక్టర్ కుమార్ దీపక్
లక్షెట్టిపేట, మే 8(ఆంధ్రజ్యోతి): కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఎలాం టి అసౌకర్యం కలుగకుండా చూడాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురు వారం లక్షెట్టిపేట మండలంలోని పలు గ్రామాల్లో రైతుల సౌకర్యార్థం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ రైతులు పండించిన సన్నరకం ధాన్యానికి ప్రభుత్వ మద్ద తు ధరతో పాటు 500రూపాయల భోనస్ కూడా ఇస్తామన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున తాగునీరు, నీడ, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు ప్రతీ కేంద్రంలో అందుబాటులో ఉంచాలన్నారు. ప్రతీ కేంద్రానికి అవసరం ఉన్నంత మేరకు టా ర్పాలిన్ కవర్లు, గోనె సంచులు సమకూరుస్తామన్నారు. కేంద్రం నిర్వా హకులు రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యం వాళ్లకు కేటాయించిన రైస్ మిల్స్‌కు కూడా తొందరగానే పంపిస్తామన్నారు. రైతులు ఇచ్చిన ధాన్యానికి తప్ప కుండా రశీదును అందించాలని తెలిపారు. అనంతరం లక్షెట్టిపేట పట్టణంలో నూతనం గా నిర్మాణం చేపడుతున్న 30పడకల ఆసుపత్రి భవన నిర్మాణం పనులను పరి శీలించారు. పనుల్లో వేగం పెంచాలని త్వరతగతిన పనులు పూర్తి చేయాల న్నారు. ఈకార్యక్రమంలో కలెక్టర్ వెంట సంభందిత అధికారులు, కొనుగోలు కేంద్రం నిర్వహకులు ఉన్నారు.
Updated Date - May 08 , 2025 | 11:29 PM